Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆరుగురు మహిళలను పొట్టన పెట్టుకున్న ..

ఆరుగురు మహిళలను పొట్టన పెట్టుకున్న ప్రైవేట్ బస్సు

* తాళ్ళరేవు బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

*ఆటోను ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు.. నుజ్జు నుజ్జు అయిన ఆటో

*ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి.

*రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 14,(నిజం న్యూస్) బ్యూరో :: కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై సుబ్బారాయుడు దిమ్మ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఆరుగురు మహిళలు దుర్మరణం చెందారు.

మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రైవేట్ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఆదివారం రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలు ఆటోలో తాళ్ళరేవు బైపాస్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా.. ఆటోను ప్రైవేట్ బస్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

Also read:సీబీఐకి కొత్త డైరెక్టర్.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు

మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని వారిని ఆస్పత్రికి తరలించామని స్థానికులు తెలిపారు. బస్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి.

ప్రైవేట్ బస్ ఢీ కొన్న సమయంలో ఆటోలో ఎనిమిది మంది ఉన్నట్టు సమాచారం. తాళ్ళరేవు బైపాస్ రోడ్డుపై చోటు చేసుకున్న పెను రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల తోపాటు.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.