Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బ్లాస్టింగ్ వల్ల భారీ శబ్దాలు

ఇష్ట రాజ్యాంగ బ్లాస్టింగ్

కూలిపోతున్న ఇండ్లు, బోర్లు భూమిలో కూరుకుపోతున్నాయి

బ్లాస్టింగ్లతో సర్వం కోల్పోతున్నాం

పంటలకు జనజీవనానికి తీవ్ర నష్టం

జిన్నారం మే 14 (నిజం న్యూస్)

జిన్నారం మండలంలోని మాదారం గ్రామంలో 26 సంవత్సరాలుగా కంకర క్రషర్ల కొనసాగుతున్నాయి.
క్రషర్ల నుంచి వస్తున్న కాలుష్యంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నాం మాదారం కాజిపల్లి గ్రామాలలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు పాత ఇండ్లు, బోర్లు కూలిపోతున్నాయి
కంకర క్రషర్ల తో చాలా రైతులు నష్టపోతున్నారు పొలాల వద్ద వేసుకున్న బోర్లు భూమిలోకి కురుకుపోతున్నాయి
బ్లాస్టింగ్ వల్ల భారీ శబ్దాలు, దుమ్ము, ధూళి సమీపంలో ఉన్న పొలాలలో రాళ్లు ఎగిరి పడుతున్నాయి బ్లాస్టింగ్లతో సర్వం కోల్పోతున్నాం

Also read: తేమ పేరుతో రైతులను మోసం చేస్తుండ్రు 
ఇంట్లో వంట చేసే సమయంలో బ్లాస్టింగ్ శబ్దాలకు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లుగా అనిపిస్తుంది చాలా భయంతో బతుకుతున్నాం
ఈ క్వారీల గ్రామపంచాయతీ పరిధి లోని మాదారం, మంత్రి కుంట రహదారి పైన వెళ్లే వాహనదారులు బ్లాస్టింగ్ తో భయాందోళనలో పడుతున్నారు.

*దుమ్ము, ధూళితో అనారోగ్య సమస్యలు*

బ్లాస్టింగ్ వల్ల వచ్చే కాలుష్యపు దుమ్ము, ధూళి పీల్చుకొని చిన్న పిల్లల్లో శ్వాసకోశ అనారోగ్యానికి గురవుతున్నారు పెద్దవాళ్లలో క్యాన్సర్ కు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు