Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జిహెచ్ఎంసి ఆదాయాన్ని గండి కొడుతున్న టౌన్ ప్లాన్ అధికారులు…?

బాలానగర్ ప్రాంతంలో సాయి నగర్ లో అక్రమ నిర్మాణం

*అధికారులకు ముడుపులు అందడంతో చర్యలకు విఫలం.

*టౌన్ ప్లాన్ అధికారులు పూర్తిగా మద్దతు నిలుస్తున్న అక్రమ నిర్మాణం నిర్మలదారులకు.

కూకట్ పల్లి: మే 14 (నిజం న్యూస్) మూసాపేట్ సర్కిల్ 23 బాలానగర్ డివిజన్ రోడ్ నెంబర్ 10 సాయి నగర్ ప్లాట్ నెంబర్ 123 పరిధిలో అక్రమ నిర్మాణాల దారుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది వారికి అధికారుల అండదండలు ఉండడంతో సర్కిల్ 23 పరిధిలోని పలు ప్రాంతాల్లో యదేచ్చగా అక్రమ నిర్మాణాలు ఆకాశాన అంటుతున్నాయి.

బల్దియా ఖజానాకు గండి కొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మూసాపేట్ సర్కిల్ 23 పరిధిలోని సాయి నగర్, బాలానగర్ ప్రాంతంలో నిర్మాణదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన అవి బుట్ట దాఖలు అవుతున్నాయి.

Also read: OTT లో  మే-21 న విరూపాక్ష 

సర్కిల్ 23 పరిధిలోని టౌన్ ప్లానింగ్ భాగంలో పనిచేస్తున్న అధికారులపై ఎన్ని ఆరోపణాలు స్థానికులు విశాయాన్ని కలిగిస్తుంది. అధికారుల తీరు మారకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగడాలకు అడ్డుకట్టూ పడడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అక్రమాన్ని నిర్మాణాలపై చర్యలు ఉన్నత స్థాయి అధికారులు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.