గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు రాసిన కథలు …బాల మందారాలు
మంత్రి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మే 13
(నిజం న్యూస్)
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు రాసిన కథలు సమాజంలోని సమస్యలకు అద్దం పట్టేలా ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తన క్యాంప్ ఆఫీసులో పి. వేంకటేశ్వర్లు సంపాదకత్వంలో వచ్చిన బాల మందారాలు అనే కథా సంకలనాన్ని ఆవిష్కరించి విద్యార్థులను అభినందించారు.
ALSO READ: కుట్ర సినిమా ఫస్ట్ లుక్ ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
ఇలాగే సమాజానికి ఉపయోగపడే రచనలు చేస్తూ,భవిష్యత్తులో గొప్ప రచయితలు ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రిన్స్ పాల్, స్టాఫ్ తమ కళాశాల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు.
వినతి పత్రం చదివి సానుకూలంగా మంత్రి స్పందించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎర్రోజు వెంకటేశ్వర్లు ,వైస్ ప్రిన్సిపాల్ మమత, లెక్చరర్ శ్రావణి.. విద్యార్థులు అనూష ,వర్ష పాల్గొన్నారు