Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కుట్ర సినిమా ఫస్ట్ లుక్ ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి ఎమ్ పి వెంకటేష్ నేత
దర్శకుడు సిరిపురం రాజేష్ ని అభినందించిన పలువురు ప్రముఖులు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మే 13
(నిజం న్యూస్)
సిరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సిరిపురం లావణ్య – రాజేష్ నిర్మించిన కుట్ర సినిమా ఫస్ట్ లుక్ ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ పెద్దపెల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్ నేత ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో చిన్న నిర్మాతలు ముందుకు వచ్చి సినిమాలు తీయడం శుభ సూచకమని అంటూ, దర్శకుడు సిరిపురం రాజేష్ ను అభినందించారు.

ALSO READ: నిధులు ఫుల్ …నాణ్యత ప్రమాణాలు నిల్లు

కుట్ర సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి,ఎమ్ పీ తో పాటు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ , నిజామాబాద్ శాసనసభ్యులు శ్రీ బిగాల గణేష్ గుప్త , పెద్దపల్లి శాసనసభ్యులు మనోహర్ రెడ్డి , రామగుండం శాసనసభ్యులు కోరుకొండ చందర్ అసోసియేషన్స్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, బ్రిలియంట్ మోడల్ స్కూల్స్ చైర్మన్, సిరిపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.