Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒక్క రాష్ట్రంలో గెలిస్తేనే రెచ్చిపోతున్నారు

కరీంనగర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కన్నడనాట హిందూ వ్యతిరేక శక్తులన్నీ కలిసి బీజేపీ విజయాన్ని అడ్డుకున్నాయని వ్యాఖ్యానించారు.

పక్క రాష్ట్రంలో గెలవగానే తెలంగాణలో కూడా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు బీరాలు పలుకుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక్క రాష్ట్రంలో గెలిస్తే రెచ్చిపోతున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారని, జేడీఎస్ కామ్ అవ్వడానికి కారణం కూడా ఆయనే అని ఆరోపించారు.

Also read: కర్ణాటక గెలుపు తెలంగాణ లో పునరావృతం అవుద్ది

‘కర్నాటక ఎన్నికలకు ఇక్కడి బీఆర్ఎస్ డబ్బులు పంపింది. ఒక వర్గం కోసం పనిచేసే పార్టీలన్నీ ఏకమయ్యాయి. తెలంగాణాలో మైనారిటీ సంతుష్ఠ రాజకీయాలు పనిచేయవు. ఇక్కడ ఉపఎన్నికల్లో ఏ విజయాలైతే బీజేపీని వరించాయో.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ ఆ ఫలితాలే పునరావృతం కానున్నాయి.

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ ఏకమవుతాయి. మళ్ళీ దేశంలో మోదీ సర్కారే వస్తుంది. తెలంగాణాలో ఆర్థికంగా, అన్ని రంగల్లోనూ ముందుకు వెళ్లాలంటే మోదీ నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ అవసరం.’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.