Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కర్ణాటక గెలుపు తెలంగాణ లో పునరావృతం అవుద్ది

మహబూబాబాద్ జిల్లా కురవి,మే,13 నిజం న్యూస్

ఈరోజు కర్ణాటక కాంగ్రెస్ కు ప్రజలు పట్టంకట్టారు.224సీట్లకు ఎగ్జెట్ పోల్స్ అంచనాలను మించి హస్తం పార్టీ కి 136 సీట్ల తో స్పష్టమైన మెజార్టీ కర్ణాటక ప్రజలు అందించారు.విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కొరవి టౌన్ అధ్యక్షులు నారాయణ రాజేందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో టపాకాయలు కాల్చి కార్య కర్తలతో కలిసి స్వీట్ పంచుతూ కుంకుమ చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

Also read: విటులకు నిలయాలుగా కురవి ప్రైవేట్ లాడ్జ్ లు

కాంగ్రెస్ పార్టీ కురవి మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం,టౌన్ అధ్యక్షులు నారాయణ రాజేందర్,జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రజినీకాంత్
ఈ సందర్భంగా మాట్లాడుతూ… కర్ణాటక రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం సంతోషదాయకం అని,నియంతృత్వ పోకడలతో దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రజలు బుద్ది చెప్పారు అని,కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పభం గడుపుతున్న బిజెపికి కర్ణాటక తీర్పు గుణపాఠం అని కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని,పేదల పక్షాన నిలబడి కొట్లడే పార్టీ అని కర్ణాటక గెలుపు రాబోయే రోజుల్లో తెలంగాణ లో పునరావృతం అవుతుందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కురవి మండల ప్రధాన కార్యదర్శి ఆవేరి మోహన్ రావు,డోర్నకల్ నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు ఇస్లావత్ సుధాకర్,తట్యాతండా గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్,తులిస్య తండా గ్రామ పార్టీ అధ్యక్షులు బాలాజీ నాయక్,నల్లెల్ల గ్రామ పార్టీ అధ్యక్షులు బండి మల్లయ్య,రేకుల తండా ఎస్టీ సెల్ అధ్యక్షులు లాలా నాయక్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కామెళ్ళ వీరన్న, మండల యూత్ నాయకులు కొర్ని అనిల్,మండల సీనియర్ నాయకులు చిన్నం గణేష్, మిరియాల లక్ష్మయ్య,తరాల వీరభద్రం కమెడ్ల ఆనందం,బెడద విశ్వనాథం తరాల వీరన్న, తదితరులు సీనియర్ నాయకులు యువజన నాయకులు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.