Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిధులు ఫుల్ …నాణ్యత ప్రమాణాలు నిల్లు

కన్నెత్తి చూడని ఆర్ అండ్ బీ అధికారులు

బోనకల్ : మే 13, (నిజం న్యూస్) ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ కొరవడింది.క్వాలిటీ కంట్రోల్‌ శాఖ తనిఖీలు లేవు. ఇంకేముంది…పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్లతనం.. అవినీతి మయం కనిస్తోంది.

ALSO READ : ఒక్క రాష్ట్రంలో గెలిస్తేనే రెచ్చిపోతున్నారు

ఏళ్ల తరబడి మండలంలో చిరునోముల చొప్పకట్లపాలెం వెళ్లే రోడ్డు మార్గం గుంతలు పడి ప్రయాణికులు వాహనదారులు అనేక ఇబ్బందులు పడడమే కాక కొంతమంది ప్రమాదాలకు గురి అవుతూ వారి ప్రయాణాలు సాగించుకుంటు వచ్చారు.

ప్రయాణికులు రోడ్డు ఇకనైనా మోక్షం కలుగుతుందేమో అనుకున్నారు.గుంతలు పుడుస్తూ రోడ్డు పోస్తున్నారని సంతోషం వ్యక్తం చేసే సమయంలో కానీ కాంట్రాక్టర్ మాత్రం నాణ్యత ప్రమాణాలు లేకుండా చేతులు డులుపుకునేలా మమ అనిపిస్తున్నారు.

గ్రామానికి చెందిన కొందరు రోడ్డు పనులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.పనుల తీరుపై పెదవి విరుస్తున్నారు.రోడ్డు నిర్మాణ పనులపై ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.