విటులకు నిలయాలుగా కురవి ప్రైవేట్ లాడ్జ్ లు

కురవి పవిత్రతను అపవిత్రం చేస్తున్న ప్రైవేటు లాడ్జి యజమానులు
ప్రైవేటు లాడ్జిలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం,,
టాస్క్ ఫోర్స్ కదిలితేనే పోలీసుల్లో చలనం,,
ఐదు జంటలు లాడ్జి ఓనర్ పై కేసు నమోదు
మహబూబాబాద్ బ్యూరో మే 13 నిజం న్యూస్
మహబూబాబాద్ కురవి మండలం లో
కీస్తుశఖం 750 సంవత్సరాల క్రితం తూర్పు చాళుక్యులు పరిపాలించిన వేంగి చాళుక్యులు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అలాంటి దేవాలయ పరిసరాలను పవిత్రతను కాపాడవలసిన అధికారులు చూసి చూడనట్లు ఉండడంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రైవేట్ లాడ్జిలకు విరాలజీల్లుతున్నట్లు కురవి పుర ప్రముఖులు ప్రజలు చర్చించుకుంటున్నారు.
నిత్యం కురవి మండల కేంద్రానికి శ్రీ వీరభద్ర స్వామి వారి దర్శనానికి, ప్రతి సోమవారం కురవి సంతకు వేలాది మంది భక్తులు, ప్రజలు, వస్తూపోతూ ఉంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాంతాన్ని కొంతమందికి దేవాలయ పరిసరాల్లో ఇల్లు ఉండటంతో వాటిని లాడ్జిలుగా ఉపయోగించి దర్శనానికి వచ్చే భక్తులకు కిరాయిలకు ఇస్తూ ఉంటారు.
భక్తుల నుంచి అధిక మొత్తంలో పైసలు రాకపోవడంతో ,,విటులకు నిలయంగా,, మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఆలయం తోపాటు కురవి క్షేత్రము, పవిత్రతను, లాడ్జిల యజమానులు అపవిత్రంగా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
గతంలో ప్రైవేటు లాడ్జిలపై ఎన్నోసార్లు అధికారులకు, పోలీసులకు, ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తు గదులు కిరాయికి ఇచ్చే వారిపై చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్లు ఉండడంతో ప్రైవేట్ లాడ్జిలా ఓనర్లకు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది, దీంతో వారు సొమ్ము చేసుకుని లక్షలు గడుస్తున్నారని ప్రజలు గుసగుసలాడు కుంటున్నారు.
ప్రధానంగా అసాంఘిక కార్యకలాపాలు నడవడానికి పోలీసులే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో లాడ్జి రోజుకి 20 నుంచి 30 వేల రూపాయల గిరాకులు వస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ లాడ్జి ఓనర్ చెప్పటం గమనార్హం, టస్క్ ఫోర్స్ అధికారులు వచ్చి లాడ్జిలపై రైడింగ్ చేస్తున్నారు అని తెలియగానే పోలీసులు ఆగ మేఘాల మీద లాడ్జిలు దగ్గరకు వచ్చారని ప్రజలు అంటున్నారు.
Also read: చెరువు, కుంటలలో నల్లమట్టి రాత్రికి రాత్రే మాయం
పై అధికారులు వస్తేనే మండల అధికారుల్లో చలనం వస్తుందని, లేకుంటే నెలనెలా వచ్చే మామూలు మత్తులో ఉండిపోతారని ప్రజలు అనుకుంటున్నారు,
టస్క్ ఫోర్స్ అధికారులు లాడ్జి లపై దాడులు చేయగా ఐదు జంటలను పట్టుకొని అరెస్టు చేసామని అలాగే ఓ లాడ్జి ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఇంత జరిగినా కూడా మళ్లీ విటులు లాడ్జిలకు వస్తుండటం గమనార్హం.
ఆలయ పరిసరాల పవిత్రతను కాపాడాలి
కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆవిరమోహన్ రావు,
కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున ధర్నా రాస్తారోకోలు నిరాహార దీక్షలు చేపడతామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారులకు విన్నవించామని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ లాడ్జిలపై ఉక్కు పాదం మోపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు, అధికారుల్లో చలనం రాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్పీ ఆఫీస్ దగ్గరనే నిరాహార దీక్ష చేస్తామని ఆయన హెచ్చరించారు.
ప్రైవేటు లాడ్జిలను వెంటనే సీజ్ చేయాలి
తెలంగాణ గిరిజన సంఘం నాయకులు,, మాలోతు కిషన్ నాయక్,, కురవి లో ఉన్న ప్రైవేటు లాడ్జిలను వెంటనే సీజ్ చేయాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. లాడ్జిలకు 18 సంవత్సరాల అమ్మాయిలు నుంచి 50 సంవత్సరాల వయసు వారి వరకు వస్తున్నారని వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టి కురవి పవిత్రతను అధికారులు కాపాడి ఆధ్యాత్మిక శోభను తీసుకరావాలని ఆయన సూచించారు. అలా లేని పక్షంలో గిరిజన సంఘం తరఫున కురవిలోని ప్రైవేటు లాడ్జిల ఎదురుగా నిరసన దీక్ష చేపడతామని ఆయన అన్నారు. పోలీసులు అధికారులు మామూలు మత్తులో పడి లాడ్జిలపై చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.