Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చెరువు, కుంటలలో నల్లమట్టి రాత్రికి రాత్రే మాయం

-చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు!!

వెల్దండ మే 13( నిజం న్యూస్ ): మండల పరిధిలోని అంతిరెడ్డిపల్లి గేటు సమీపంలోని చిన్నపాటి చెరువు నుండి రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి స్థానిక వ్యక్తులతో పరిచయం ఏర్పాటు చేసుకుని 3 లక్షల రూపాయలు పరిచయస్థులకు ఇచ్చి గత నెల రోజుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండ రాత్రికి రాత్రే చెరువు, కుంటలలోని నల్ల మట్టిని తరలిస్తున్నాడని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

గత నెల రోజుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నల్ల మట్టిని రాత్రి వేళలో తరలిస్తుంటే అజిలాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు అడ్డుపడడంతో ఆ గ్రామ అభివృద్ధి కొరకు 7,50,000/ రూపాయలు ఇచ్చినట్టు కూడ గ్రామస్తుల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also read: కోసిగి పోలీస్ స్టేషన్ లో రైటర్ వీరన్న నిర్వాకంతో ఉద్యోగం కోల్పోయా..!

మూడు మండలాలు మాడ్గుల, వెల్దండ,ఆమనగల్ సమీప గ్రామమైన అంతిరెడ్డిపల్లి గేటు సమీపంలోని చిన్నపాటి చెరువు నుండి నల్ల మట్టిని రాత్రి వేళలో టిప్పర్ల ద్వారా కలకొండ,చంద్రాయన్ పల్లి, పోలేపల్లి గేట్, సింగంపల్లి, ఆకుతోటపల్లి,కోనాపూర్ నుండి హైదరాబాద్ హైవేకు కలిసి మహేశ్వరం, తుక్కుగూడ, పాడి షరీఫ్ పట్టణాలకు ఇటుక బట్టీల కొరకు నల్ల మట్టిని తరలించి కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఐదు గ్రామాలు కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు దాటుకుంటు అక్రమంగా నల్ల మట్టిని తరలిస్తుంటే సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంలో ఈ నాలుగు మండలాల ప్రజలు సంబంధిత అధికారులపై విమర్శలు వెలు వెత్తుతున్నాయి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేలుకొని రాత్రి వేళలో అక్రమంగా తరలిస్తున్న నల్ల మట్టిని అరికట్టి అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.