కోసిగి పోలీస్ స్టేషన్ లో రైటర్ వీరన్న నిర్వాకంతో ఉద్యోగం కోల్పోయా..!
*పోలీసులు బాధితుల నుంచి డబ్బులు డిమాండ్
(కర్నూలు జిల్లా) కోసిగి మే 13 నిజం న్యూస్
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి పోలీస్ స్టేషన్ లో రైటర్ వీరన్న నిరుద్యోగులతో డబ్బులు వసూళ్లపై విచారించి చర్యలు తీసుకుంటామని, పోలీసులు బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే నాకు ఫిర్యాదు చేయాలని సీఐ ఎరిషావలి తెలిపారు
రైటర్ గా పని చేస్తున్న వీరన్న పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని వీరేష్ అనే యువకుడు ఆరోపించాడు.
శుక్రవారం బాధితుడు ఆ వివరాలను వెల్లడించాడు. కోసిగిలోని 9 వ వార్డుకు చెందిన వడ్డె ఎల్లప్ప కుమారుడు వడ్డె వీరేష్ ఇంటర్ వరకు చదువుకున్నాడు.ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరడానికి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అడిగారు.
Also read: పొత్తుల తోటే జగన్ ను చిత్తు చేద్దాం
దీంతో గత నెల ఏప్రిల్ 24న మీసేవా సెంటర్ లో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లగా విచారించి సర్టిఫికెట్ ఇస్తామని అక్కడి పోలీస్ సిబ్బంది చెప్పి పంపించారు.
ఐదు రోజుల తర్వాత వీరేష్ స్టేషన్ కు వెళ్లగా రైటర్ వీరన్న రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో వీరేష్ తన తండ్రి వడ్డె ఎల్లప్పుతో కలిసి మధ్య వర్తిగా తీసుకుని స్టేషన్ కు వెళ్లాడు. రూ. 2 వేలు ఇస్తానని చెప్పినా వినిపించుకోలేదు.
దీంతో చివరకు తాను ఉద్యోగం కోల్పోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కోసిగి పోలీస్ స్టేషన్ లో రైటర్ వీరన్న నిరుద్యోగులతో డబ్బులు వసూళ్లపై విచారించి చర్యలు తీసుకుంటామని, పోలీసులు బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే నాకు ఫిర్యాదు చేయాలని సీఐ ఎరిషావలి తెలిపారు.