పొత్తుల తోటే జగన్ ను చిత్తు చేద్దాం
*జగన్ సీఎం అయితే ఏపీ మళ్లీ కోలుకోదు.
*సీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు. ఈ సీఎం ఉండకూడదనేదే ముఖ్యం.
*ఎన్నికల్లో ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయో దాన్ని బట్టి సీఎం అభ్యర్థి ఖరారవుతారు.
*నేను సీఎం కావాలంటే 48- 50 శాతం ఓట్లను జనసేనకు ఇవ్వండి. అప్పుడే నేను సీఎంగా డిమాండ్ చేస్తాను.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 13, నిజం న్యూస్ బ్యూరో:: మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో పొత్తులు, రాబోయే ఎన్నికల్లో పోటీ ఇలా చాలా విషయాలపై పవన్ తేల్చి చెప్పేశారు.
అంతేకాదు.ఇదే సమావేశంలో పార్టీలో విబేధాల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ముఖ్యంగా నాదెండ్ల విషయంలో అసలేం జరుగుతోంది..? పార్టీ నేతలు ఎందుకింతలా రియాక్ట్ అవుతున్నారు..? అనే విషయాలపై ఫుల్ క్లారిటీ ఇస్తూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనం మధ్యనే కూర్చొని కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపొందిస్తాం. జనసేనలో ఉండేవాళ్లకే నేను బాధ్యతలు ఇస్తాను. ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయే వాళ్లకి నేను బాధ్యతలు ఇవ్వను.
పార్టీలో నాదెండ్లను చాలా మంది విమర్శిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పార్టీలో అనుకూల శత్రువులుగా మారొద్దు. అనుకూల శత్రువులు ఎవరైనా ఉంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తానన్నారు.
మనోహర్ ఏ రోజూ నన్ను సంప్రదించకుండా ఏం మాట్లాడరు. నాదెండ్ల లాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకోవాలి. కానీ తూలనాడొద్దు. నేను అంటే పడి చచ్చిపోతామనే వాళ్లు. నాదెండ్లను విమర్శిస్తున్నారు.
ఇలాంటి వాళ్లను నేను వైసీపీ కోవర్టులుగానే భావిస్తాను. నా మీద కోపాన్ని నాదెండ్ల మీద చూపుతున్నారు. ఏదైనా ఉంటే నా మీదే కోప్పడండి. నన్నే విమర్శించండి. వ్యాపారస్తులను బెదిరించొద్దు. నాకు ఫిర్యాదులు అస్సలు రాకూడదు అని ఎవరైనా సరే తగ్గేదేలే అని పవన్ తేల్చి చెప్పేశారు.
Also read: కర్ణాటక లో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సీట్ల సంఖ్య ఇవే
సిఎం అభ్యర్థి ఎవరనేది..?
నేను సీఎం కావాలంటే.. నన్ను గౌరప్రదమైన స్థానంలో కూర్చొబెట్టాలి. 48-50 శాతం ఓట్లు జనసేనకు ఇవ్వండి.. సీఎం సీటు అడుగుదాం. వైఎస్ జగన్ పచ్చని చెట్లను కొట్టేసే వ్యక్తి. ఏ కులానికి న్యాయం చేశాడు? ప్రతి కులానికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్.
జగన్ ఏపీ వ్యతిరేక వ్యక్తి. అడ్డగోలుగా సంపాదించిన వ్యక్తి. మరోసారి జగన్ సీఎం అయితే ఏపీ మళ్లీ కోలుకోదు. మన ఓటింగ్ శాతం పెరిగింది. కానీ ఈ ఓటింగుతో ప్రభుత్వాన్ని స్థాపించలేం.
రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తులు తప్పనిసరి. అందుకే పొత్తులే కావాలంటున్నాను. కచ్చితంగా జనసేన-టీడీపీ-బీజేపీ పోత్తుతోనే ఎన్నికలకు వెళ్తాం. సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికలయ్యాక తేలుతుంది. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయో చూసి ఆ తర్వాత సీఎం అభ్యర్థి ఖరారు అవుతారు.
సీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు.ఈ సీఎం ఉండకూడదనేదే ముఖ్యం. ఆవేశంతో రాజకీయం చేయకూడదు. టీడీపీ-బీజేపీలతో పొత్తుకు సిద్దమనే ప్రకటించాం. ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు.
పొత్తు ఖరారై విధి విధానాలు ఓకే అయితే కామన్ మినిమమ్ ప్రొగ్రాం సెట్ చేస్తాం’ అని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేసేశారు.