రూ.35 వరకు పెరగనున్న టికెట్ ధర
దేశంలోని పలు రైల్వేస్టేషన్లను అత్యాధునిక సదుపాయాలతో రైల్వేశాఖ తీర్చిదిద్దింది. ఆయా స్టేషన్లలో ప్రయాణికుల నుంచి ఇకపై రూ.10-35 వరకు అదనపు రుసుం వసూలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే ఇది కేంద్ర కేబినెట్ ముందుకు రానుండగా.. ప్రయాణికులు కొనుగోలు చేసే టికెట్ తరగతిని బట్టి ఈ రుసుం విధించనుంది. దేశంలోని ఏడు వేల రైల్వేస్టేషన్లలో దాదాపు 700-1000 స్టేషన్ నుంచి ప్రయాణించే వారిపై ఈ భారం పడనుంది.