రూ.25 కోట్ల లంచం అడిగిన NCB మాజీ అధికారి పై అవినీతి కేసు నమోదు
షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన కోర్డెలియా ఓడ యజమానుల నుంచి 25 కోట్ల రూపాయల లంచం కోరినందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మాజీ అధికారి సమీర్ వాంఖడేపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అవినీతి కేసు నమోదు చేసింది.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను “అరెస్ట్ చేయనందుకు” ₹25 కోట్ల లంచం కోరాడు. ఈ కేసుకు సంబంధించి సమీర్ వాంఖడే నివాసంలో కూడా దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహిస్తోంది. ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌లోని 29 ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ALSO READ: సోషల్ మీడియాలో వచ్చే అనధికార ప్రకటనలకు మోసపోకండి
ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించకుండా ఉండటానికి సమీర్ వాంఖడే, అతని సహచరుడు అడ్వాన్స్‌గా ₹ 50 లక్షలు వసూలు చేసినట్లు సిబిఐకి సమాచారం అందిందని అధికారులు తెలిపారు.
అక్టోబర్ 2, 2021న కోర్డెలియా క్రూయిజ్ షిప్‌లో డ్రగ్ బస్ట్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. సమీర్ వాంఖడే ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌లో కార్డెలియా క్రూజ్‌పై దాడి చేసి షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్ కేసులో అరెస్టు చేశారు.
ఈ కేసులో మాదకద్రవ్యాలను కలిగి ఉండటం, వినియోగం, అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయి. ఆర్యన్ ఖాన్ 22 రోజులు జైలులో గడిపాడు. “తగిన సాక్ష్యాలు లేకపోవడం” తో 2022 మేలో NCB క్లీన్ చిట్ ఇచ్చింది.