Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సోషల్ మీడియాలో వచ్చే అనధికార ప్రకటనలకు మోసపోకండి

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.

మహబూబాబాద్ బ్యూరో మే12 నిజం న్యూస్

ఫేస్బుక్/ఇంస్టాగ్రామ్, తదితర సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా ఎవరైనా మీకు లాటరీ వచ్చింది, జాబ్స్ ఇప్పిస్తాము ,ఏదైనా విలువైన వస్తువులు తక్కువ ధరకు అందిస్తాము, అని అనధికార ప్రకటనలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు .

పోస్ట్ చేయడం గాని, మెసేజ్ చేయడం గాని చేస్తూ అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ వారు మీకు ఎటువంటి వస్తువులు గాని, ఉద్యోగాలు గాని , లాటరీ డబ్బులు కాని ఇప్పిస్తామని మీ దగ్గర నుండి నగదు ,బదిలీలు చేయమని రకరకాల మాయమాటలు చెప్పి మీ డబ్బులు లాగేస్తారు.

ALSO READ: ఘనంగా అమ్మవారి జాతర పట్టి

ఇటువంటి సైబర్ మోసగాళ్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఫేస్బుక్/ఇంస్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే అనధికార ప్రకటనలను చూసి నమ్మి మోసపోకండి. అని ఎస్పి అన్నారు.

ఈ విధంగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే వారి ఫేస్బుక్ /ఇన్స్టాగ్రామ్, ప్రొఫైల్ ఐడి ,వారు చేసిన అనధికారం పోస్టర్లు, లేదా ప్రకటన లింక్స్లను స్క్రీన్ షాట్ తీసి 1930 ఫోన్ చేయడం ద్వారా గాని, లేదా డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యూ. సైబర్ క్రైమ్. జిపిసి. ఇన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి కానీ ,లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు గాని సమాచారం ఇవ్వగలరు అని ఎస్ పి తెలియజేశారు.