ఘనంగా అమ్మవారి జాతర పట్టి
అడవిదేవులపల్లి: మే 12 (నిజంన్యూస్ )
అడవిదేవులపల్లి గ్రామ దేవత శ్రీ మహిషాసుర మర్దిని కనకదుర్గమ్మ అమ్మవారి జాతర పట్టి కార్యక్రమాన్ని శుక్రవారం నాడు గ్రామ పెద్దలు ఆచారవంతులు మరియు గ్రామ సర్పంచ్ సమక్షంలో మొదలు పెట్టడం జరిగింది.
అడవిదేవులపల్లి గ్రామ దేవతగా పేరుగాంచిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి జాతర మహోత్సవము ను ప్రతి సంవత్సరం మే నెలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు
ALSO READ : ఎన్ని రోజులకు సమస్యను పరిష్కరిస్తారు.. సార్
అట్టి జాతరకు పది రోజులు ముందుగా పట్టి కార్యక్రమాన్ని మొదలుపెడతారు
మే నెల 21వ తారీకు ఆదివారం నుండి మొదలై మే 29 సోమవారం వరకు ఘనంగా నిర్వహిస్తారు
ఈ యొక్క జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు
మొక్కితే వరమిచ్చే తల్లిగా భక్తులందరికీ అమ్మ వారిపై ప్రగాఢ విశ్వాసం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,మరియు ఉప సర్పంచ్,ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, ప్రజలు,ఆచారవంతులు పాల్గొన్నారు.