ఎన్ని రోజులకు సమస్యను పరిష్కరిస్తారు.. సార్
అర్జీ పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులకు సమస్యను పరిష్కరించాలి
పెద్దకడబూరు తహసిల్దార్ నెలలు తరబడి ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్న వైనం
పైసలిస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందా లేకపోతే లేదా
(కర్నూలు జిల్లా) పెద్దకాడబురు మే 11 నిజం న్యూస్
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో పెద్దకడబూరు మండలమైనటువంటి హెడ్ క్వార్టర్స్ లో తహసిల్దార్ కార్యాలయం నందు ఒక వ్యక్తి తన ఇంటి పట్టా పోయిందని ఆ స్థానంలో ఇంకొకటి మంజూరు చేయాలని అర్జి పెట్టుకున్నాడు
అలాగే ఇంకొక వ్యక్తి తన దగ్గర ఇంటి పట్టా ఉంది కానీ ఆ స్థలం ఎక్కడుందో తెలియదు ఇలా ఇద్దరు వ్యక్తులు గత నెల రోజుల క్రితం అర్జీ పెట్టుకున్నారు మండల తాసిల్దార్ వీరేంద్ర గౌడ్ ఆర్ జి మీద సంతకం చేసి మండల సర్వేయర్ కు రిఫర్ చేశాడు
ALSO READ: ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు అమ్మాలి
ఒక నాలుగైదు రోజుల తర్వాత మీకు కాల్ చేస్తామని మండల సర్వే సమాధానం చెప్పింది అర్జీ పెట్టుకున్న అర్జీదారులు మండల సర్వేయర్ దగ్గరికి వెళ్లి ఏమైంది మేడమ్ కాల్ చేస్తామన్నారు
దాదాపు నెల రోజులు కావస్తున్నా ఫోన్ చేయలేదు అని అడిగితే ఆమె ఇష్టానుసారంగా సమాధానం చెప్పడం జరిగింది ఇలా నెలలు తరబడి ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు
ఈ విషయంలో అధికారులు వెంటనే స్పందించి ఆ వ్యక్తుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులను కోరారు