Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు అమ్మాలి

రైతులకు ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు అమ్మాలి

రైతులకు విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం

కర్నూలు డీఏవో పీఎల్ వరలక్ష్మి

కర్నూలు మే 11 (నిజం న్యూస్)

కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్లో నాణ్యమైన విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని కర్నూలు డీఏవో పీఎల్ వరలక్ష్మి సూచించారు.

కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో విత్తన కంపెనీల ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు.ఆమె మాట్లాడుతూ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించినా,విత్తన కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో అమ్మినా కఠినచ ర్యలు తీసుకుంటామన్నారు.

ALSO READ: మహాదేవునికి కుంభాభిషేకం

పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పత్తి, మిరపతోపాటు అన్ని రకాల విత్తనాలు, ఉద్యాన పంటలకు సంబంధించిన విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలన్నారు