Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహాదేవునికి కుంభాభిషేకం

తూర్పుగోదావరి జిల్లా (బిక్కవోలు మండలం) మే 12, నిజం న్యూస్..

బిక్కవోలు మండలం మెళ్ళూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం పునప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా మూడవ రోజు శుక్రవారం జరిగిన మహా కుంభాభిషేకంలో బాలభక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో శిరసున కలశాలు ధరించి గ్రామ ప్రధానవీధులలో ఊరేగింపుగా బయలుదేరి ఓం కారం నామంతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దీనితో గ్రామం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుని పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం శమీవృక్షం సందర్శించి బాలభక్తులు తిరిగి శివాలయం చేరుకొని యాగశాలలో జరిగిన
మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు.

ALSO READ: జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరణ

ఈ సందర్బంగా పండితులు మాట్లాడుతూ శివయ్య చల్లని దీవెనలతో గ్రామం సుభిక్షంగా ఉండటానికి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదం చేస్తాయని,ప్రపంచానికి నాగరికత నేర్పిన గొప్ప ఉన్నతమైన విశిష్ట సంసృతి హైందవ ధర్మానిది అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేలాది భక్తులు పాల్గొన్నారు.