Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అప్పట్లో గడీల పాలన…. ఇప్పుడు ఫామ్ హౌస్ ల పాలన

-పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో జిల్లా మంత్రి సబితపై భట్టి ఫైర్.

-మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పదవులే ముఖ్యం.

– పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మూడెకరాల భూమి,కేజీ టు పీజీ విద్య ఏమైంది?

-నియోజక వర్గ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదు.

– భట్టికి స్వాగతం పలికిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం,టీపిసిసి మాజీ అధికార ప్రతినిధి పామేనా భీమ్ భరత్.

చేవెళ్ల మే 12 (నిజం న్యూస్ ):

తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లో రాచరికపు గడీల పాలన కొనసాగిందని ఇప్పుడు ఫామ్ హౌస్ ల పాలన కొనసాగుతుందని భట్టి విక్రమార్క అన్నారు.తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత అసెంబ్లీ మాజీ స్పీకర్ భట్టి విక్రమార్క తలపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం మద్దూరులో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.

శుక్రవారం షాబాద్ మండలం చందనవెళ్లి సీతారాంపూర్ హైతబాద్ భూనిర్వాసితులను ఆయన కలిశారు.నిర్వాసితులు భూములలో జరిగిన అన్యాయాన్ని భట్టి విక్రమార్కకు వివరించారు. అసెంబ్లీలో షాబాద్ మండల భూసమస్యను లేవనెత్తి ప్రశ్నిస్తానని వారికీ హామీ ఇచ్చారు.

అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మా భూములు మాకు! మా పాలన మాకు! మా సంపద మాకోసమే అని పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.కానీ కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎవని దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి పేద బిడ్డలకు అందిస్తామన్న,కేజీ టు పీజీ ఉచిత విద్య విధానం ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు.

ధరణి పోర్టల్ లో పేద ప్రజల భూములను ఆక్రమించుకోవడానికి వచ్చిందన్నారు.తెలంగాణలో రంగారెడ్డి జిల్లా భూములు దేశంలోనే అత్యంత విలువైనయన్నారు.ఏడేళ్ల పాలనలో ప్రజా సంక్షేమం పక్కన పెట్టి ముఖ్యమంత్రి భూముల కోసమే ఎగబడ్డారన్నారు.

Also read:రైతులు వరి కొయ్యలను కాల్చవద్దు

నిజాం పరిపాలనలలో జమీందారు కోట మాదిరిగా కెసిఆర్ కుటుంబం హైదరాబాదు చుట్టూ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారన్నారు.బిఆర్ఎస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ ను రోల్ మోడల్ గా తీసుకుని వాళ్ళు కూడా ఫామ్ హౌస్ లు నిర్మిస్తున్నారన్నారు.అసలు రాష్ట్రంలో ప్రధాన భూ పరిపాలన కమిషనర్ “సీసీఎల్” ఉందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో పేదలకు భూములు పంచితే బిఆర్ఎస్ ప్రభుత్వం భూములు లాక్కొని నాలుగు కోట్లకు ఎకరా చొప్పున సెజ్ ల పేరుతో ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టిందన్నారని మండిపడ్డారు.

షాబాద్ మండలంలో రైతుల భూములు లక్ష కోట్ల ఆస్తులను లాక్కున్నారన్నారు. అమాయక రైతులు భూముల విలువ తెలువక నలిగిపోతే కేసీఆర్ ముఖం వెలుగుతుందని ఎద్దేవా చేశారు.

రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేశారని వీరిపై సిఐడి తో సమగ్ర విచారణ జరిపించాలన్నారు. అప్పటి కలెక్టర్ లోకేష్ కుమార్ విచారణ జరిపించమని చెప్పినా అధికారులు ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టకపోవడం దారుణమని అన్నారు.

బాధితుల పక్షాన గవర్నర్ కు,రాష్ట్రపతికి భూ సంబంధిత అధికారులకు లేఖ రాస్తామన్నారు.చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సలహాతో ధరణి తెచ్చి వేల ఎకరాల భూములను లూటీ చేశారన్నారు.

ఆంధ్రలో విధులు నిర్వహిస్తున్న సోమేశ్ కుమార్ రిటైర్మెంట్ తీసుకొని రాష్ట్రంలో ఇంకేం కుంభకోణం చేయడానికి కెసిఆర్ సలహాదారుగా వచ్చాడన్నారు.సీఎం చేసిన తప్పులు కప్పిపుచ్చడానికే సోమేష్ వచ్చాడని ఆయన తక్షణమే సలహాదారుడి పదవి నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు.

ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును వైయస్సార్ హయాంలో 10 వేల కోట్ల ఖర్చు చేసి పనులు ప్రారంభించారన్నారు.ఇంకో 20 వేల కోట్లు ఖర్చు చేస్తే మూడు సంవత్సరాల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తయి రంగారెడ్డి జిల్లాకు నీరొచ్చి శస్య శ్యామలం అయ్యేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నేటికీ మొదటి పంపు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు.రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల బోడు పెట్టారే తప్ప కృష్ణ,గోదావరి నీళ్లు రంగారెడ్డికి రాలేవన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ధర్నా చేశారన్నారు. ఉద్యమకారుల ప్రాణాలను పణంగా పెట్టి బిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా చేరి చేవెళ్లను మర్చిపోయారన్నారు. నీళ్ల కంటే, నియోజకవర్గ ప్రజల కంటే పదవులే ముఖ్యమని పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డి తీరును తప్పుపట్టారు.

రాష్ట్రంలో నాయకులు తమ ప్రాంతం కోసం రాజీనామా చేశారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా,చేవెళ్ల నియోజకవర్గం కోసం ఏం చేశారని ప్రశ్నించారు.రాష్ట్రంలో విద్యాశాఖ ప్రమాదంలో ఉందని ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు.

కృష్ణా గోదావరి పాలమూరు- రంగారెడ్డి జిల్లాకు నీరు తేకపోతే మంత్రి సబితకు,ఎమ్మెల్యేలకు ఓట్లు అడిగి నైతిక హక్కు లేదన్నారు. దేశంలో ఇటు రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని భీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి,జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి,జనార్దన్ రెడ్డి, ఉదయ్ మోహన్ రెడ్డి,చేవెళ్ల నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి,టీపీసీసీ కార్యదర్శి రాంరెడ్డి,డిసిసి ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి,టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సిద్దేశ్వర్

డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షలు షాబాద్ దర్శన్,దేశమల్ల ఆంజనేయులు,

పెంటయ్య గౌడ్,మండపార్టీ అధ్యక్షులు కావాలి చంద్రశేఖర్,చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి,

మొయినాబాద్ మండలపార్టీ అధ్యక్షులు మనయ్య,షాబాద్ సర్పంచ్ తమ్మాలి రవీందర్,చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు పెంటరెడ్డి,చేవెళ్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మద్దేల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ల సంఘము అధ్యక్షులు మధుసూదన్ గుప్త,గౌరీసతీష్,అక్తర్ పాషా,పామేనా నర్సింలు, మహేందర్ ముదిరాజ్,ఎంపీటీసీలు వెంకట్ రెడ్డి,చెన్నయ్య,అశోక్,మాజీ సర్పంచ్ నారెడ్ల గూడెం ముక్కురవి,హైతాబాద్ శేఖర్,రవీందర్ నాయక్,నర్సింగ్ రావ్,చేవెళ్ల నియోజకవర్గం యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు పెంటరెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ భార్గవ్ రామ్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బ్యాగరి శ్రీనివాస్,బాలకృష్ణ రెడ్డి,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుశాంత్,దామోదర్ యాదగిరి,మల్లేష్,షాబాద్ మండలం,చేవెళ్ల శంకర్పల్లి మొయినాబాద్ మండలాల సర్పంచులు,ఎంపీటీసీలు,పిఎసిఎస్ చైర్మన్లు అధ్యక్ష కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.