Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతులు వరి కొయ్యలను కాల్చవద్దు

గరిడేపల్లి మే 12 నిజం న్యూస్.

రైతులు వరి కోయ్యలను కాల్చవద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ వ్యర్ధాలను కాల్చడం వలన అవి బూడిదల మారి పంటకు తీవ్ర హాని చేస్తాయని తెలిపారు.

వ్యవసాయ వ్యర్థాలను కాల్చకుండా భూమిలోనే దున్నడం వల్ల సేంద్రియ ఎరువులు తయారయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలియపరిచారు.

Also read: విధులకు డుమ్మా…. డ్యూటీలో ఉన్నట్లు సంతకం చేసిన వైద్య సిబ్బంది…!

ఇప్పటికే భూమిలో రసాయన పదార్థాలు పేరుకుపోవడం వలన రాబోయే రోజులలో పంటలు పండే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు.

రసాయనిక వ్యర్థాల నుండి భూమిని, పంటను, కాపాడుకోవడం కోసం సేంద్రియ పదార్థాలను వాడాల్సిన బాధ్యత రైతులది అని సూచించారు.

ఇప్పటికే ప్రజలు రసాయనక వ్యర్ధాల వలన అనారోగ్యాల బారిన డుతున్నారని అన్నారు.

కాబట్టి రైతులు తొలకరి వర్షాలకు పంట పొలాలలో మెట్టదుక్కులు వేయాలని సూచనలు చేశారు.