Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విధులకు డుమ్మా…. డ్యూటీలో ఉన్నట్లు సంతకం చేసిన వైద్య సిబ్బంది…!

మోతే మే 12 (నిజం న్యూస్):-

మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ అధికారి గా పనిచేస్తున్న సల్వది శ్రీనివాస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి లు శుక్రవారం విధులకు డుమ్మా కొట్టి డ్యూటీ లో ఉన్నట్లు గా హజర్ రిజిష్టర్ లో సంతకాలు పెట్టిన వైనం.

మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుల తరబడి జరుగుతున్న తంతు ఇటివల కాలంలో సహా ఉద్యోగుల పై తన ప్రతాపం చూపిస్తున్నారని పలు కథనాలు వచ్చిన నేపథ్యంలో నూతనకల్ మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలువురి మహిళల పై జరిగిన కొన్ని సంఘటనల పై జిల్లా స్థాయి అధికారుల విచారణ చేసి మహిళలను వేధిస్తున్నాడని సంబధిత వైద్య శాఖ అధికారులకు నివేదికలు అందించిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే జిల్లా స్థాయి వైద్యశాఖ అధికారులు ముడుపుల మత్తు లో జోగుతున్నట్లు సమాచారం.

పని చేయకుండా సంతకాలు పెట్టి విధులకు డుమ్మకొట్టే అధికారులతో మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విలసిల్లడం తో సిబ్బంది తీరుతో రోజు వారీగా ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు చర్చించు కుంటున్నారు.

పని చేసే చోటనే తోటి ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరుపై జిల్లా స్థాయి వైద్యశాఖ అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్)

సి హెచ్ ఓ శ్రీనివాస్ తోటి మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడిన సదరు ఉద్యోగి సిహెచ్ఓ సల్వాధి శ్రీనివాస్ పై విచారణ జరిపి సస్పెంన్షన్ చేయమని నివేదిక ఇవ్వగా సస్పెన్షన్ చేయకుండా వర్క్ ఆర్డర్ పేరుతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే అధికారిగా వీధుల్లోకి తీసుకున్నారు.

రోజువారి విధులు నిర్వహించకుండా మండల వైద్యాధికారి మెప్పు తో తన ఇష్టానుసారంగా వ్యవహరించడం పలువురి పత్రిక విలేకరుల దృష్ఠిలో పడటం తో చేసేది లేక వైద్యాధికారి వివరణ ఇచ్చారు.

Also read: తగ్గిన వెండి, బంగారం ధరలు

మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగరాజు

వివరణ రోజు మాదిరిగానే విధుల్లో భాగంగా హాజరు పట్టికలో సంతకం పెట్టి మూమెంట్ షార్ట్ లో సంతకం చేసి సబ్ సెంటర్లకువిజిటింగ్ వెళ్ళడం జరిగిందనని మండల వైద్యాధికారి సమాధానం చెప్పారు.

రిజిస్టర్లో సంతకం చేసి ఈరోజు విధుల్లో గైర్హాజర్ అయ్యారు అని విలేకరులు ప్రశ్నించగా నీళ్లు మింగిన వైద్యాధికారి సమాధానం దాటవేశారు. ఆరోగ్యం బాగోలేక హాస్పిటలకి ఖమ్మం వెళ్లారని మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు సమాచారం వచ్చిందని తెలిపారు.