లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
వారాంతంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 62,027 వద్ద ముగియగా.. నిఫ్టీ 17పాయింట్ల లాభంతో 18,314 వద్ద స్థిరపడింది.
HDFC బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించగా.. ఇన్ఫోసిస్, లార్సెన్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.
Also read: జోస్ బట్లర్ మ్యాచ్ ఫీజులో 10% జరిమానా
మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడు పైసలు పతనమై 82.16 దగ్గర నిలిచింది.