Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఐకెపి కేంద్రాలకు లారీలు రావడం లే..?

కొనుగోలు జరుగుతున్న.. లారీలు ….రాకపాయె!

మిల్లర్లు, లారీ ట్రాన్స్పోర్టేషన్ తో ఇబ్బందులకు గురవుతున్నట్లు కొనుగోలు యాజమాన్యం వెల్లడి.

సుమారు 1650 రైతులు, రెండు లక్షల బస్తాలధాన్యం కొన్నట్లు అధికారుల వెల్లడి…

తుంగతుర్తి మే 11నిజం న్యూస్

తుంగతుర్తి మండలములో మొత్తం 24 ధాన్యపు కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదట పది రోజులు కొనుగోలు మంద కోడిగా సాగి, ప్రస్తుతం ఊపందుకున్నాయి.

గడచిన 20 రోజులుగా మండలంలో మొత్తం 1650 మంది రైతుల నుండి, సుమారు మూడు లక్షల బస్తాలు కొనుగోలు జరపద వీటిలో రెండు లక్షల పైచిలుకు ధాన్యాన్ని కాంటావేసి సంబంధిత మిల్లులకు పంపినట్లు ఐకెపి ఎపిఎం నరసయ్య తెలిపారు.

కొనుగోలు కేంద్రం నుండి వెళ్లిన లారీలు ఎక్కువ టైం దిగుబడి జరుగుతుందని, దీనితో సమయానుకూలంగా, గడచిన మూలు రోజుల నుండి కొన్ని ఐకెపి కేంద్రాలకు లారీలు రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు యాజమాన్యం తెలిపారు.

ప్రస్తుతానికి 925 మంది రైతులకు, డబ్బులు వారి ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. గత వారం రోజులుగా వర్షాలు ఉండడంతో రైతులు ఇబ్బంది పడినట్లు అధికారులు తెలిపారు. కొనుగోలు వేగవంతం చేయుటకు జిల్లా ఉన్నతాధికారుల సకాలంలో లారీలను పంపాలని ఐకెపి యాజమాన్యం కోరుతున్నారు.

ALSO READ: 15 రోజులుగా చీకట్లోనే ఆ గ్రామం

గడిచిన మూడు రోజులుగా గానుగు బండ ఒక్క లారీ రాలేదు

కట్ల చంద్రయ్య వార్డు మెంబర్, గానుబండ

కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యాన్ని కష్టపడి యాజమాన్యం కాంటాలు వేసినప్పటికీ, గడిచిన మూడు రోజులుగా ఏ ఒక్క లారీ కూడా గానుగుబండ ఐకెపి కేంద్రానికి రాలేదని వార్డు మెంబర్ కట్ల చంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి లారీలను తొందరగా పంపాలని కోరారు లేనియెడల వర్షం వస్తే రైతులు అనేక ఇబ్బందులు గురి అవుతారని పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు కాంటాలు నడుస్తున్నాయి.

ఐకెపి ఎపిఎం నరసయ్య తుంగతుర్తి.

గడిచిన వారం రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఊపందుకొని ధాన్యం కాంటాలు జరుగుతున్నాయి. సంబంధిత మిల్లర్ల వద్ద లారీలు పడి కాపులు కాస్తున్నాయి. త్వరగా దిగుమతి చేసుకోవడానికి మిల్లర్ల యాజమాన్యం సహకరించాలని కోరారు. రైతుల నిరాశ చెందవద్దని ప్రతి ధాన్యం ప్రభుత్వమే కొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు…