15 రోజులుగా చీకట్లోనే ఆ గ్రామం
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో 15 రోజులుగా చీకట్లో అబ్బిరెడ్డిగూడెం గ్రామం
గరిడేపల్లి మే 11 (నిజం న్యూస్) మండల పరిధిలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో గత 15 రోజులుగా కరెంటు కోతతో బాధపడుతున్న గ్రామస్తులు ఎర్రటి ఎండలో కూడా గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి షేక్ యాకుబ్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం మూలాన గ్రామంలో ప్రజలు విద్యుత్తు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని యాకూబ్ అన్నారు
ఈ అప్పన్నపేట ఫీడర్ ఛానల్ ఎందుకు స్పందించడం లేదు నిన్న ఏఈ కి ఫోన్ చేస్తే రెండు గంటలు ఎంగేజ్ వస్తుంది లైన్ మేలుకు ఫోన్ చేస్తే లైన్మెన్ స్పందించడు లోకల్ వేలపరుకు ఫోన్ చేస్తే సమాధానం ఉండదు డిఇ కి ఫోన్ చేస్తే నేను మాట్లాడి చెప్తాను అన్నారు.
ALSO READ: ఏ క్షణంలో పడిపోతుందో అన్న భయం
అధికారులు ఏం చేస్తుండ్రు ఓ పక్కంగా 24 విద్యుత్ 24 గంటలు విద్యుత్ ఇస్తున్నాము అని ప్రభుత్వం చెబుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద ఉందని యాకూబ్ అన్నారు.
తక్షణమే అధికారులు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే గరిడేపల్లి సబ్స్టేషన్ ముట్టడి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపూరి సైదులు, లక్ష్మణ్ బెజ్జం ముత్తయ్య, మరియమ్మ, నాగలక్ష్మి, కలమ్మ, నిమ్మల శార, రేవూరి సత్యం,
షేక్ దస్తగిరి పలువురు పాల్గొన్నారు