ఏ క్షణంలో పడిపోతుందో అన్న భయం
నిద్రావస్థలో విద్యుత్ అధికారులు
మూడు సంవత్సరాలుగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 11(నిజం న్యూస్)
తానూర్ మండలంలోని ఎల్వీ గ్రామములో విద్యుత్ స్తంభం అడుగు భాగంలో పోల్ విరిగి, ఇనుపరాడ్లు కనిపిస్తున్న, ఏ క్షణంలో పడిపోతుందో అన్న భయంలో కొత్త స్తంభం వేయుమని విద్యుత్ అధికారులని వేడుకున్న, స్తంభం వేయడానికి మూడు సంవత్సరాలు అయిన అధికారులలో కదలిక లేదు.
ఎల్వీ గ్రామములో రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇంటి ముందు స్తంభం ప్రమాదకరంగా వుంధని,స్తంభం విరిగి ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయనీ, విద్యుత్ అధికారులకు మూడు సంవత్సరాలు కింద ఫిర్యాదు చేసానని, స్తంభం ప్రత్యామ్నాయం కోసం కొత్త స్తంభం తెచ్చారు.కాని దానిని అమర్చకుండా, దానిని మరొక ప్రదేశానికి మార్చారు.
ఇప్పటికైనా స్పందించి కొత్త విద్యుత్ స్తంభాన్ని అమర్చాలని కోరుతున్నారు.
ALSO READ: కేంద్ర-ఢిల్లీ సర్వీసుల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది