పరీక్ష రాయనివారికి ప్రవేశం ఎలా కల్పిస్తారు?

 

ప్రైవేట్ డీఈడీ కాలేజీలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఈడీ కాలేజీల్లో ‘స్పాట్ అడ్మిషన్ పేరుతో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. డీసెట్ పరీక్షలో అర్హత సాధించని వారికి, అసలు పరీక్ష రాయనివారికి ప్రవేశం ఎలా కల్పించారని హైకోర్టు ప్రశ్నించింది. విద్యా విధానం లాభసాటి వ్యాపారంగా మారిందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.