Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కన్నడలో కాంగ్రెస్‌ ముందంజ..?

కన్నడ కలల సౌధం ఎవరిదో..!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఈలోగా ఎన్నికలు ముగిసిన వెంటనే సంస్థలు తమ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలను ప్రకటించాయి. చాలావరకు ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌కు మెజార్టీ దక్కతుందని తేల్చాయి. బిజెపి అధికారంలోకి రావడం కష్టమేనని కూడా తెలిపాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బిజెపి కన్నా కాంగ్రెస్‌ ముందంజలో ఉంది.

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల ప్రకటనతో కాంగ్రెస్‌ శిబిరంలో సమజంగానే ఉత్సాహం నెలకొంది. ఎవరికి వారు తామే ముఖ్యమంత్రి కాబోతున్నట్లుగా ప్రకటించుకుం టున్నారు. మొత్తంగా కర్ణాటకలో బిజెపి ప్రభుత్వ పతనం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి.
ఇదిలావుంటే ఓటర్లలో ఇంకా చైతన్యం రావడం లేదు. ముఖ్యంగా ఉద్యోగులు ఇళ్లు వీడడం లేదు. సెలవు ఇచ్చినా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఓటు అన్నది ప్రభుత్వాల ఏర్పాటులో కీలకం అన్నది గుర్తించడం లేదు. ఎవరికి వారు తమకెందుకులే అన్న చందంగా ఉండడంతో ఓటింగ్‌ శాతం తగ్గిపోతోంది.

కర్నాటకలో దాదాపు 66 శాతం మాత్రమే ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ పరిస్థితి మారడం లేదు. ఓటు వేయకుంటే సంక్షేమ, అభివృద్ది పథకాలను కట్‌ చేయాలి. అలాగే ప్రభుత్వ సేవలు అందకుండా చేయాలి. అప్పుడే ప్రజలు ఓటు కోసం వస్తారు.

ఇకపోతే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ పుంజుకోవడం ఖాయమని తేలింది. బజరంగ్‌దళ్‌ నిషేధం, ముస్లింలకు పదిశాతం రిజరర్వేషన్లు ఇక్కడ బాగా కాక  పుట్టించాయి. ఇవి ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది కూడా ముఖ్యం. 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో పూర్తి మెజారిటీకి 113 సీట్లు కావాలి. కాంగ్రెస్‌కు 120కు పైగా స్థానాలు వస్తాయని, బిజెపికి ఈసారి వంద కూడా రావని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. జెడి(ఎస్‌)కు 20 స్థానాలు వరకూ వస్తాయని ఫలితాలు చెబుతున్నాయి. ఈ సర్వే ఓ రకంగా బిజెపికి వ్యతిరేకంగా ప్రజల మూడ్‌ను తెలియచేస్తోంది.

ALSO READ: వరుసగా మూడవ రోజు లాభాలు

కర్నాటకలో బిజెపి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. అక్కడ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉన్నా ప్రజలకు ఒరిగింది శూన్యం. ఈ క్రమంలో అక్కడ బిజెపి ఓడితే గుణపాఠం నేర్చుకోవాలి. లేదా సర్వేలను కాలరాస్తూ గెలిస్తే మంచి పాలనకు శ్రీకారం చుట్టాలి. అయితే కర్ణాటకలో బిజెపి ప్రభుత్వ పతనం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ పుంజుకోవడం ఖాయమని తేలింది. 2

సిఎంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని 42 శాతం మంది, ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మై అని 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అని 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్ప అని 14 శాతం మంది, డి.కె.శివకుమార్‌ అని 3 శాతం మంది కోరుకుంటున్నారని ఈ సర్వే తెలిపింది.

కర్ణాటకలోని మొత్తం ఆరు రీజియన్లలో ఐదింటిలో కాంగ్రెస్‌ ముందంజలో ఉండగా కోస్తా కర్ణాటకలో మాత్రం బిజెపి ముందంజలో ఉంది. ముంబయి కర్ణాటకలో కాంగ్రెస్‌ బిజెపిపై స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది. ఓల్డ్‌ మైసూర్‌లో కాంగ్రెస్‌ జెడి(ఎస్‌) పై స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది. బిజెపికి మరొకసారి అవకాశం ఇస్తారా అని అడగ్గా 53 శాతం ఇచ్చేది లేదని, 41 శాతం ఇస్తామని, 6 శాతం ఏవిూ చెప్పలేమని సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టో, రాహుల్‌ జోడోయాత్ర కొంతవరకు ప్రభావం చూపాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రావిూణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య తదితర అంశాలపై అధికార బిజెపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రధానంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెరుగుదల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది.

పాత పెన్షన్‌ పథకం అమలు చేయకపోవడం తో బిజెపిపై ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రస్తుత బిజెపి ప్రభుత్వంలోని అవినీతిని ఎండగడుతూ చేసిన ’40శాతం కమిషన్‌ సర్కారు’ నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లింది.

బిజెపి లేవనెత్తిన జై బజరంగ్‌బలి, టిప్పు సుల్తాన్‌, ఈద్గా మైదాన్‌ వంటి వివాదాస్పద అంశాలు ప్రజలపై ప్రభావం చూపలేక పోయాయి ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేత వల్ల ముస్లింలు ఏకపక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యారని కూడా భావిస్తున్నారు. రాష్ట్రంలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టినట్లు పీపుల్స్‌ సర్వే పేర్కొంది.

ALSO READ: రబీ సీజన్‌ బియ్యం సేకరణ మే 31 వరకు

కొన్ని ఎ గ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు వస్తాయని, జెడిఎస్‌ కింగ్‌ మేకర్‌గా ఉంటుందని పేర్కొన్నాయి. బిజెపి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశముందని సువర్ణ జంకీబాత్‌, న్యూస్‌ నేషన్‌ సిజిసి సర్వే మాత్రమే పేర్కొన్నాయి. అయితే సర్వేలు ఒక్కోసారి నిజం అవుతున్నాయి. ఒక్కోసారి విఫలం అవుతున్నాయి.

నిజానికి బిజెపి పాలన దేశంలో ఏమంత గొప్పగా లేదు. కర్నాటకలోనూ పెద్దగా గొప్పగా లేదు. అక్కడ కమిషన్ల ప్రభుత్వంగా పేరుగడిర చింది. ఈ క్రమంలో బిజెపికి ఓటేయాల్సిన అవసరం లేదని ప్రజలు గుర్తించారా అన్నది చూడాలి. అయితే చాలా సంస్థల అంచనాలను పరిశీలిస్తే హంగ్‌ సభ ఏర్పడే అవకాశాలను కొట్టివేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఒక వేళ హంగ్‌ ఏర్పడితే ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్‌ మరోమారు కింగ్‌ మేకర్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ పరిస్థితి రాదని.. సొంతంగానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రకటించారు. సీఎం బసవరాజ్‌ బొమ్మై మాత్రం ఈ సర్వేలను తోసిపుచ్చారు.

తమకు క్షేత్ర స్థాయి నుంచి అందిన సమాచారం ప్రకారం.. సంపూర్ణ మెజారిటీతో గెలుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 113 సీట్లు అవసరం కాగా.. ప్రధాన సంస్థలు వెల్లడిరచిన ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం కాంగ్రెస్‌కు 106కుపైగా ఖాయమని స్పష్టమవుతోంది.