Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బిజెపిలో కూడా మోడీ తీరుపై అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత

మోడీకి సవాల్‌ కానున్న ప్రియాంక
రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేశాక ఆయన సోదరి, ఇందిర మనవరాలు, మాజీప్రధాని రాజీవ్‌ గాంధీ తనయ ప్రియాంక చురుకుగా రాజకీయ ప్రచారం చేస్తున్నారు. ఆమెకు తన నానమ్మ పోలికలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల గుర్తించిన తెలంగాణ పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇందిరమ్మగా అభివర్ణించారు. దీనికితోడు ఆమె కూడా పరిణతి చెందిన రాజకీయ నేతగా మాట్లాడుతున్నారు.

హైదరాబాద్‌ సభ ద్వారా కెసిఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీసారు. నిరుద్యోగుల్లో భరోసా నింపారు. కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వండి..అన్నీ చేసిచూపుతాం..చేయలేకపోతే తిరిగి లాగేసుకోండి అన్న మాటలు ప్రజలకు ముఖ్యంగా యువతకు సూటిగా తాకాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అంటున్న మోడీకి రానున్న రోజుల్లో ప్రియాంకతో ముప్పు ఉండవచ్చు. ప్రజల్లో మళ్లీ ఇందిర నాటి పాలన అంటూ ముందుకు సాగితే కాంగ్రెస్‌ పునరుజ్జీవనం సాధ్యం అన్న ఆలోచనలో కాంగ్రెస్‌ శ్రేణులు ఉన్నాయి.

రాహుల్‌కన్నా ఆమెకే ఛరిష్మా కూడా ఉందనడంలో సందేహం లేదు. తాజాగా జరుగుతున్న కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే ప్రియాంక వైపు నాయకత్వం మళ్లే ఛాన్స్‌ ఉంది. అందుకే మరోమారు అధికారం దక్కించుకునే క్రమంలో ప్రధాని మోడీ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్‌ పై ఎత్తులు వేస్తోంది.

రాహుల్‌ నాయకత్వంపై దేశవ్యాప్తంగా కూడా నమ్మిక ఏర్పడుతున్న క్రమంలో ఆయన పార్లమెంట్‌కు అనర్హుడిగా మారారు. ఇంతకాలం రాహుల్‌ను కాంగ్రెస్‌ శ్రేణులు భావి ప్రధానిగా భావించారు. సూరత్‌ కోర్టు తీర్పు తరవాత ఇప్పుడు అంతా ప్రియాంకను తెరపైకి తెచ్చారు.

తెలంగాణలో కూడా ఇటీవల నిరుద్యోగ సంఘర్షణ సదస్సులో ప్రియాంక ఆకట్టుకునేలా ప్రసంగం చేశారు. ఇకపోతే బిజెపిలో కూడా మోడీ తీరుపై అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. మోడీ, అమిత్‌షాలు పార్టీని తమగుప్పిట్లో పెట్టుకుని ఆడిరదే ఆటగా సాగిస్తున్నారన్న ఆందోళన నెలకొంది.

ALSO READ: పవర్ కట్ అనేది ఈ రెండు గ్రామాలకు నిరంతర సమస్య

నోట్ల రద్దు, జిఎస్టీ దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపినా వీటిపై ప్రధాని మోడీ నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. అలాగే ముక్త కాంగ్రెస్‌ దాడిని మోడీ పెంచారు. అందుకే ఆగగేఘాల విూద రాహుల్‌ను పార్లమెంటుకు అనర్హుడిని చేశారు. అయినా రాహుల్‌ హుందాగా తన ఇల్లును కూడా ఖాళీ చేసి చెంపవిూద కొట్టారు. ఈ దశలో ఇక కాంగ్రెస్‌ మరో ట్రంప్‌ కార్డు కోసం పాచిక వేసింది. ఇంతకాలం కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయిన ప్రియాంకను ఇక నేరుగా ప్రతక్ష్యక్ష రాజకీయా ల్లోకి దింపడం ద్వారా మోడీని ఢీకొనాలని కాంగ్రెస్‌ ఎత్తుగడ వేశారు.

ప్రియాంకగాంధీ ఎప్పటికైనా రాజకీయాల్లో సత్తా చాటుతారని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తు న్నాయి. కొడుకు కోసం సోనియా అడ్డుపడుతున్నదన్న ప్రశ్నలు ఇంతకాలం వేధిస్తూ వచ్చాయి. అచ్చం ఇందిరమ్మలాగా ఉండే ప్రియాంక వస్తేనే కాంగ్రెస్‌ బతికిబట్టకట్టడం సాధ్యమని భావిస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు అధికంగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీని ఓడిరచడం సాధ్యం కాధన్న భావనలో వీరు ఉన్నారు.

రాష్టాల్ల్రో కూడా బిజెపి ఎదగడం ద్వారా ఎందుకనో మోడీని ఓడిరచడం సాధ్యం కాదన్న భయం వారిని వెన్నాడుతూనే ఉంది.ఈ దశలో కర్నాటక ఎన్నికల్లో రాహుల్‌తో పోటీగా ప్రియాంక ప్రచారంలో దూసుకుని వెళ్లారు. కర్నాటకలో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక ప్రియాంక మాత్రమే కాంగ్రెస్‌ను బతికిస్తుందని అని ఇంతకాలం నమ్ముకున్న కాంగ్రెస్‌ అభిమానులకు ప్రియాంక రాజకీయరంగ ప్రవేశం రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది.

ఇంతకాలం కుటుంబపరంగా అమ్మ, అన్నల విజయం కోసం అమెథీ లోనూ, రాయ్‌బెరిల్లీలోనూ ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంక, పార్టీ కోసం పనిచేయలేదు. ప్రియాంక ఇప్పుడు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ హోదాలో రాష్టాల్రు పర్యటిస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇది మోదీపై సర్జికల్‌ దాడి అనీ, రాజకీయ బ్రహ్మాస్త్రమనీ చాలామంది భావిస్తున్నారు.

ALSO READ: మినీ స్టేడియం కోసం నిధులు కేటాయించండి
ప్రియాంకను తెరవిూదకు తేవడంతో బీజేపీ వణికిపోతున్నదని రేవంత్‌ లాంటి నేతలు కూడా అంటున్నారు. అందుకే ప్రధాని మోదీ కాంగ్రెస్‌ వంశపారంపర్య పాలనపై తరచూ విరుచుకుపడుతున్నారు. మొత్తంగా రాజకీయ ఎత్తుగడలు సాగుతున్నాయనే చెప్పాలి. ప్రియాంక ప్రభావం కర్నాటకు మాత్రమే పరిమితం కాబోదనీ, దేశమంతటా కాంగ్రెస్‌ పునరుజ్జీవనానికి ఉపకరిస్తుందని కాంగ్రెస్‌ నాయకులు సంతోషిస్తున్నారు.

తెలంగాణలో ఆమె ప్రభావం ఉంటుందని ఇక్కడి నేతలు కూడా భావిస్తున్నారు. సార్వత్రక ఎన్నికల్లో హస్తినలో పాగా వేయాలం టే 80స్థానాలున్న యూపీ అత్యంత కీలకం. పార్టీ యావత్తూ నిస్తేజంగా, నిరాసక్తంగా ఉన్న ఈ స్థితిలో ప్రియాంక ప్రచారం ఇప్పుడు కర్నాటకలో పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహన్ని ఇచ్చింది.ప్రియాంక రాక కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేరుస్తుందని ఆశిస్తున్నారు.

కర్నాటకలో అధికారం దక్కించుకోవడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలను దెబ్బతీయడం కాంగ్రెస్‌ ప్రధాన లక్ష్యం. ఇప్పుడు బీజేపీ ఓటు బ్యాంకుగా మారిన అగ్రకులాలవారిని తిరిగి మెప్పించి రప్పించే బాధ్యత ప్రియాంక తీసుకోవాల్సి ఉంటుంది. మోడీని దెబ్బకొట్టాలంటే ప్రియాంకను బ్రహాస్త్రంగా ప్రయోగించడం తప్ప కాంగ్రెస్‌కు మరోదారి లేకపోయింది.

అయితే ఆమె ఏ మేరకు కాంగ్రెస్‌కు తురుపుముక్కగా పనికి వస్తారన్నది ఎన్నికల ప్రచారం, సరళి, ఫలితాలను బట్టి తేటతెల్లం కానుంది. కర్నాటకలో కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రియాంక రాకతో ఆ కొరత మాత్ర తీరుతుంది. ఆమె ప్రచార సరళి ఎలా ఉన్నా అక్కడ అధికారం వస్తే ప్రియాంకకు ప్రాధాన్యం పెరుగుతుంది. అలాగే రాహుల్‌ కన్నా ఆమె నేరుగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ప్రియాంకకు ప్రాధాన్యం పెరగనుంది.