మినీ స్టేడియం కోసం నిధులు కేటాయించండి
ముధోల్ లో మినీ స్టేడియం కోసం నిధులు కేటాయించండి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్యే వినతి
ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 10 (నిజం న్యూస్)
ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం కొరకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను బుధవారం ముధోల్ ఎమ్మెల్యే జి. విట్టన్ రెడ్డి కోరారు.
మంత్రి సానుకూలంగా స్పందించి మినీ స్టేడియం నిర్మాణానికి త్వరలోనే నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక శాఖ) రామకృష్ణారావును సైతం ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గంలో నిలిచిపోయిన కాలేశ్వరం ఎత్తిపోతల పథకం డి28 కెనాల్ పనుల రీటెండర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
ఎమ్మెల్యే వెంట పిఎసిఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ అరిఫుద్దీన్, బిఆర్ఎస్ నాయకులు జైభీమ్, తదితరులున్నారు.