Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆంత్రిక సురక్షిత సేవ పథక అవార్డు అందుకున్న ఎస్సై

ఎస్సై కి దక్కిన ఉత్తమ అరుదైన గౌరవం

హోంమంత్రి చేతుల మీదుగా ఆంత్రికు సురక్షసేవ పథకం అందుకున్న

ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్

చిట్యాల మే 10 నిజం న్యూస్

నిత్యం శాంతి భద్రతల రక్షణపై స్నేహపూర్వక పోలీస్ సింగుతో అతికొద్ది సమయంలో చిట్యాల మండలంలోని ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ప్రజలకు యువతకు ప్రేరణ పొందుతూ చిట్యాల ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ చేసిన సేవలు గుర్తించి

బుధవారం రోజున రవీంద్ర భారతి కల ప్రాంగణంలో హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ డిజిపి అంజని కుమార్ చేతుల మీదుగా ఆంత్రిక సురక్షిత సేవ పథక అవార్డు అందుకున్నారు

ALSO READ: రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు….పవన్ కళ్యాణ్

మండల ప్రజలకు సేవలు అందించిన ఎస్ఐకి ఆంత్రిక సేవ పథకం రావడం సంతోషకరమని మండలంలోని అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల యువత ప్రజలు చెడు అలవాట్లకు బానిస కాకుండా షీ టీం ప్రోగ్రాం ఏర్పాటుచేసి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ గ్రామాలలో ప్రజల పట్ల నిత్యం శాంతి భద్రతలే రక్షణగా ఉంచుకొని ఫ్రెండ్ పోలీసు లాగా ప్రజల యొక్క సమస్యలను తీరుస్తూ ప్రజలకు యొక్క సేవ చేయడమే నా అదృష్టంగా భావిస్తూ నా యొక్క సేవలు గుర్తించి నాకు ఈ అవార్డు అందించినందుకు జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి అదనపల్లి ఎస్పీ శ్రీనివాసులు డిఎస్పి రాములు సిఐ వేణు చందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.