Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు….పవన్ కళ్యాణ్

రైతులకు అండగా నిలిచిన జన సేనాని

తూర్పుగోదావరి జిల్లా..

మే 10.. నిజం న్యూస్..

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పాడయిన వరిచేలను, మొలకెత్తిన ధాన్యాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం శివారు ఆవ గ్రామంలో పరిశీలించారు.

ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తుందని,నిబంధనలు పేరుతో రైతు నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

Also read: మంత్రి ఇంద్రకర్ రెడ్డి సాక్షిగా ..రేగా వర్సెస్/ పొదెం.. మధ్య వాగ్వాదం

ఈ సందర్బంగా నష్టపోయిన రైతులతో పవన్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.రైతులు మాట్లాడుతూ తమను నిబంధనలు పేరిట ముప్పుతిప్పలు పెడుతున్నారని,కనీసం ధాన్యం కొరకు గోనె సంచులు కూడా సరఫరా చేయడం లేదని,పంట కాలువలు కూడా బాగుచేయించడం లేదని, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.

పవన్ రైతులకు ధైర్యం చెప్పి రైతులను ఇబ్బంది పెట్టి ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని,సంఘంటితంగా పనిచేస్తే సమస్యలు తొలగిపోతాయని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన అగ్రనేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తదితరులు మరియు అసంఖ్యాకంగా జనసైనికులు పాల్గొన్నారు.