మంత్రి ఇంద్రకర్ రెడ్డి సాక్షిగా ..రేగా వర్సెస్/ పొదెం.. మధ్య వాగ్వాదం
చర్ల మే 10 (నిజం న్యూస్) దుమ్మగూడెం మండలంలో తునికాకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగామంత్రి ఇంద్రకర్ రెడ్డి హాజరయ్యారు
కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విఫ్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భద్రాచలం శాసనసభ సభ్యులు పోదెం వీరయ్య ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది
Also read: తాసిల్దార్ అకస్మిక బదిలీ
ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ ప్రస్తావన పొగడాలు ఏమిటని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రశ్నించగా ఇరువురి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది
పోలీసులు అడ్డుకోవడంతో గొడవ కాస్త సద్దుమణిగింది మంత్రి ఇంద్రాకర్ రెడ్డి సమక్షంలోనే ఇంత జరిగినా నోరు మెదపకపోవడం గమనార్హం