తాసిల్దార్ అకస్మిక బదిలీ
మానుకోట తహసిల్దార్ నాగ భవాని బదిలీ
మహబూబాబాద్ బ్యూరో మే 10, నిజం న్యూస్
మహబూబాబాద్ మండల తాసిల్దార్ నాగభవాన్ని అకస్మాత్తుగా బదిలీ జరిగింది.
దీని వెనక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయని మండల ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. “భూ”తగాదా లే ప్రధాన కారణం అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూముల సర్వేనెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేశారని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణల వల్లనే బదిలీ జరిగినట్లు అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో మహబూబాబాద్ మండల కార్యాలయంలో తహసిల్దార్ నాగ భవాని” రాత్రి “కూడా తన కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Also read: గ్రామపంచాయతీలో దొంగలు పడ్డారు…!
కొందరు అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేయాలని ఒత్తిడి చేయడం, పెద్ద మొత్తంలో లో అవినీతి జరగడం, రాత్రిపూట రిజిస్ట్రేషన్లు చేయడం కొందరు అధికార పార్టీ నాయకులకు నచ్చక నాగ భవాని బదిలీ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీలో ఒక వర్గం తహసీల్దార్ గా నాగభవాన్ని చేసిన ( రాత్రి) రిజిస్ట్రేషన్ పై విచారణ జరిపిస్తే నాగ భవాని హయాంలో జరిగిన అవినీతి బట్టబయలు అవుతుందని ఆరోపిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా కొరివి తహసిల్దార్ గా ఉన్న ఇమ్మానుయేల్ కు మహబూబాబాద్ తాసిల్దార్ గా జిల్లా పాలనాధికారి కే,శశాంక, నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సదురు తహసిల్దార్ ఇమ్మానుయేల్ మంగళవారం మహబూబాబాద్ తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. నాగ భవానిని కలెక్టరేట్ ఎక్స్ సెక్షన్ (ఎన్నికల విభాగం )కు బదిలీ చేశారు. జిల్లా కార్యాలయ సిబ్బంది మాత్రం సాధారణ బదిలీలో భాగంగానే నాగ భవాని బదిలీ జరిగిందని చెప్తున్నారు.
నాగ భవాని కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్ లపై జిల్లా పాలనాధికారి విచారణ జరిపిస్తారో ?లేదో? వేచి చూడాలి.