కొనుగోలు కేంద్రాల్లో …దొంగలు!
కొనుగోలు కేంద్రాల్లో ఒక ప్రక్క ఈదురు గాలులు, వర్షం… మరొక ప్రక్క దొంగలతో… రైతుల భయాలు.
కొనుగోలు కేంద్రాల యాజమాన్యం.. రాత్రి వేళలో నిఘా పెంచాలి.
నష్టపోయిన రైతులకు… కొనుగోలు అధికారులు, యాజమాన్యమే భరించానని రైతుల డిమాండ్ .
ఓకే ఐకెపి కేంద్రంలో… రెండుసార్లు దొంగతనాలు. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
సూర్యాపేట ప్రతినిధి మే 10 నిజం న్యూస్
తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం లో… రైతులు కష్టపడి ఆరు కాలం పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చి అమ్మకాలు జరుగుతుండగా… ఒక ప్రక్క ఈదురు గాళ్లు వర్షంతో ధాన్యం కుప్పలు తడిసి రాత్రి వేళలో రైతులు నానా కష్టాలు పడుతున్న తరుణంలో దీనికి తోడు కొంతమంది మూర్ఖులు కలిసి ఐకెపి కేంద్రాల్లో పోసిన ధాన్యమును కూడా దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటన చోటు చేసుకోవడంతో రైతులు కష్టాలను చవిచూస్తున్నారు..
జాజిరెడ్డిగూడెం ఐకెపి కేంద్రంలో గత వారం రోజుల క్రితం హుస్సేన్ రైతు రాత్రి వేళలో పంట కోసి తీసుకొచ్చిన ధాన్యంలో సుమారు 100 బస్తాలు పోయాయని తెలిపారు.
Also read: వాయుగుండం బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు…
పలువురు నాయకులు వచ్చి సందర్శించి వెళ్లిపోయారు తిరిగి మళ్లీ వారం గడవకముందే మరో రైతు గుండ్ర సైదులు 80 బస్తాల ధాన్యాన్ని దొంగలించినట్లు పేర్కొన్నారు. కనీసం కేంద్రంలో ఒకసారి దొంగతనం జరుగుతూనే రాత్రి వేళలో నిఘా పెంచవలసి ఉన్నపట్టించుకోకపోవడం నిర్లక్ష్యంతో మరోమారు దొంగతనం జరగడంతో నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో కండ్లకు కనిపిస్తుంది.
ఏది ఏమైనా పోయిన రైతుల ధాన్యానికి పూర్తి బాధ్యత ఐకెపి కేంద్రాల నిర్వహిస్తున్న అధికారులు, యాజమాన్యంపై ఉన్నది. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి రాత్రి వేళలో ఐకెపి కేంద్రాల్లో నిఘ పెంచి, నష్ట పోయిన రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు….