Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కథ వెనుక కథ

హైదరాబాద్: కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూనే ప్రత్యేకమైన కాన్సెప్ట్ చిత్రాలను రూపొందించాలనే లక్ష్యంతో దండమూడి బాక్సాఫీస్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించబడింది. ఈ బ్యానర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. ఈ చిత్రంలో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.

కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అవనీంద్ర కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది.
నిర్మాత అవనీంద్ర కుమార్ మాట్లాడుతూ.. ”మే 12న ‘కథ వెనుక కథ’ విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని నిర్మించడంలో సాయి మా ముందున్నారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూమెంట్స్‌తో ఇది చాలా బాగా వచ్చింది.

ALSO READ : ఉస్తాద్ భగత్ సింగ్  ఫస్ట్‌ గ్లింప్స్‌ 11 న …

సునీల్‌ , హీరో విశ్వంత్‌ దుద్దుంపూడికి, శ్రీజిత గౌష్‌కి, శుభశ్రీకి, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్‌’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ – ”నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లయింది. 80కి పైగా సినిమాలకు పనిచేశాను. సినిమా చాలా మంచి కంటెంట్‌తో రాజీపడకుండా ప్యాషన్‌తో రూపొందించబడింది, మా నిర్మాతకు ధన్యవాదాలు. ‘కథ వెనుక కథ’ ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది” అన్నారు.

ఈ చిత్రంలో అలీ, సునీల్, జయప్రకాష్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యూం, ఈరోజుల్లో సాయి, రూపా తదితరులు నటించారు.

సినిమాటోగ్రాఫర్లు గంగమోని శేఖర్ మరియు ఈశ్వర్ కెమెరా క్రాంక్ చేయగా, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.