Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేడు ఆంజనేయ స్వామి రథయాత్ర

జమ్మికుంట, మే 9 (నిజం న్యూస్).

శ్రీ ఆంజనేయస్వామి రథయాత్ర తేదీ10-05-2023 బుధవారం రోజున సాయంత్రం 5:00 గంటలకు శ్రీ బాలాంజనేయ దేవాలయం( రిలయన్స్ పంపు ) నుండి శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి దేవాలయం గణేష్ నగర్ వరకు ఆంజనేయ స్వామి రథయాత్ర జమ్మికుంట పురవీధుల గుండా (గాంధీచౌక్,సీతారామచంద్రస్వామి దేవస్థానం, వీణవంక రోడ్డు , మురళి టాకీస్, సువర్ణ ఫంక్షన్ హాల్ )నుండి శ్రీ సంజీవ ఆంజనేయస్వామి దేవాలయం వరకు రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది.

ALSO READ: ప్రజారోగ్యానికి పొగ

కావున జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత హనుమాన్ దీక్ష స్వాములు మరియు భక్తులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క రథయాత్రను విజయవంతం చేయగలరని ప్రార్థన.

అదేవిధంగా,శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి దేవాలయం గణేష్ నగర్ లో మధ్యాహ్నం భిక్ష మరియు సాయంకాలం పూజానంతరం అల్పాహార కార్యక్రమం కలదు