Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రజారోగ్యానికి పొగ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 9,(నిజం న్యూస్) బ్యూరో ::
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం ప్రముఖ శైవక్షేత్రం ద్రాక్షారామ శ్రీ శ్రీ మాక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారి నేడు డంపింగ్ యార్డ్ గా మారిన వైనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.

గ్రామానికి సంబంధించిన రోజువారి చెత్తను అదే రోడ్డుపై ప్రతిరోజు డంపు చేస్తూ ద్రాక్షారామ గ్రామ పంచాయతీ ప్రజారోగ్యానికి పొగ పెడుతోందని స్థానిక జన సైనికుడు సంపత్ ఆరోపిస్తున్నారు.

ALSO READ: శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి వెండి వీణ బహుకరణ

చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లోని ప్రజలు ఈ చెత్త తాలూకు కాలుష్యం, దుర్గంధాన్ని
పీల్చుకొని అనేక రోగాల బారిన పడుతున్నారని సంపత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నాయకులు గాని, అధికారులు కానీ, ఇప్పుడున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ గానీ,సచివాలయం సిబ్బంది గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.