శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి వెండి వీణ బహుకరణ
శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి వెండి వీణను బహుకరించిన వడ్డాది సత్య సాయి బాబా పద్మా దంపతులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 9,(నిజం న్యూస్) బ్యూరో ::
రామచంద్రపురం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి మూల నక్షత్ర పూజలు మంగళవారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఎల్ఐసి ఉద్యోగి వడ్డాది వీర వెంకట సత్య సాయి బాబా పద్మా దంపతులు 68 వేల రూపాయలు విలువచేసే వెండి వీణను జ్ఞాన సరస్వతి అమ్మవారికి బహుకరించారు.
ALSO READ: నేటినుండి మెళ్ళూరు శివాలయం ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవాలు
ఎండోమెంట్ ఉద్కోగి కోళ్ల రవికుమార్, ఆలయ అర్చకులు వెల్లూరు వీరభద్రరావు, అవధాని పెదపూడి సాయి విశ్వనాథ శర్మ, విల్లూరి వీరభద్ర అవధాని లకు దాత వీణను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.