నేటినుండి మెళ్ళూరు శివాలయం ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా (బిక్కవోలు మండలం)
మే 9..నిజం న్యూస్..
బిక్కవోలు మండలం మెళ్ళూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ధ్వజ, బలిపీఠ, చండేశ్వర, శిఖర, మేధా దక్షిణా మూర్తి,
కాలభైరవ సహిత పాంచాహ్నిక పునః ప్రతిష్ట మహోత్సవాలు ఈ నెల 10వ తేది నుండి 14వ తేది వరకు జరుగుతాయని ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.
ఈ కార్యక్రమాలలో భాగంగా బుధవారం గోపూజతో యాగశాల ప్రవేశం తదితర పూజ కార్యక్రమాలు గురువారం నాడు వేదపారాయణం, విఘ్నేశ్వర పూజ తదితర పూజ కార్యక్రమాలు శుక్రవారం నాడు 108 కళశములతో బాలభక్తులతో శివునికి మహా కుంభాభిషేకం,శనివారం నాడు గ్రామ దేవత మూల ముంత్ర హోమములు,ఆదివారం నాడు యంత్ర స్థాపన,ధ్వజ స్థాపనము,అనంతరం మహా అన్న సమారాధన జరుగుతాయని ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.
ALSO READ: నేడు 2 నిమిషాల పాటు …మీ నీడ మాయం
ఈ సందర్బంగా గ్రామంలో జరుగుతున్న మహోత్సవాలలో ప్రతీ ఒక్కరూ పాల్గొని మహాదేవుడైన శివయ్య అనుగ్రహం పొందాలని మెళ్ళూరు భక్త సమాజం అందరినీ ఆహ్వానిస్తున్నారు.