Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అతివేగం…ట్రాక్టర్ పై నుండి పడి…

*ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి మృతి

పోలీసు అధికారుల నిర్లక్ష్యమే.. అతి వేగంగా వెళుతున్న ట్రాక్టర్లు.

20 సంవత్సరాలకే కన్నతల్లిదండ్రుల కడుపుకోత… గ్రామంలో విషాదఛాయలు.

సూర్యాపేట ప్రతినిధి మే 10 నిజం న్యూస్

ఇసుకను దిగుమతి చేసి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కరివిరాల శివారులో మంగళవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన పోలెబోయిన అజయ్ కుమార్ (20) ఇసుక ట్రాక్టర్లు దిగుమతి చేసి మద్దిరాల మండలం కుక్కుడం గ్రామానికి దిగుమతి చేసి వస్తుండగా

Also read: గవర్నమెంట్ కాలేజీ లో 991 మార్కులు సాధించిన విద్యార్ది

కరివిరాల శివారులోని కోళ్ల ఫారమ్ దగ్గర అతి వేగంగా రావడంతో స్టీరింగ్ నుంచి కిందపడి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి పోయి వ్యక్తి బలమైన గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు, మరో వ్యక్తికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా గతంలో ఎన్నో దినపత్రికలు అరవపల్లి … తుంగతుర్తి, నాగారం … తుంగతుర్తి కి అతివేగంగా ట్రాక్టర్లు రోడ్లపై బెంబేలు చేస్తున్నారని పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పోలీస్ అధికారుల పూర్తి నిర్లక్ష్యంతోనే నేడు మృత్యువాత పడ్డారని, వివిధ పార్టీ నాయకులు ,మేధావులు గుసగుసలాడుతున్నారు.

ఇకనైనా జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అతి వేగంగా వెళుతున్న వాహనాలపై కొరడా జులిపించాలని ప్రజలు కోరుతున్నారు….