గవర్నమెంట్ కాలేజీ లో 991 మార్కులు సాధించిన విద్యార్ది
ఇంటర్ పరీక్షలలో ప్రతిభ చూపిన వైష్ణవి దేవి
హుజూర్ నగర్ మే 9 ( నిజం న్యూస్)
ఈరోజు విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాలలో పట్టణానికి చెందిన కంజివరపు వైష్ణవి దేవి 1000 మార్కులకు గాను 991 మార్కు లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
అతి పేద కుటుంబానికి చెందిన వైష్ణవి దేవి తండ్రి సురేంద్ర కుమార్ గతంలో పెయింటింగ్ ఆర్టిస్టుగా పనిచేయగా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధితో ఫ్లెక్సీలు అందుబాటులోకి రావడంతో ఆయన పూర్తిగా తన ఉపాధిని కోల్పోయారు.
ప్రస్తుతం దినసరి కూలీగా, అయ్యప్ప స్వాములకు గురుస్వామిగా సేవలందిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించారు కడు పేదరికం కారణంగా వైష్ణవి దేవి ప్రైవేట్ కాలేజీలలో చదవలేక కేవలం గవర్నమెంట్ కాలేజీలలో మాత్రమే చదివి ఆమె ప్రతిభా పాటవాలను చూపి పరీక్షా ఫలితాలలో ఉన్నత స్థాయిలో నిలవడం హర్షినీయం.
ALSO READ: చివరి బంతిని ఫోర్ కొట్టడంతో గెలిచిన KKR
ఆమె ప్రస్తుతం హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
కడు పేద కుటుంబానికి చెందిన వైష్ణవి దేవి అత్యంత ప్రతిభా పాటవాలను స్వశక్తితో సాధించటం పట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డి అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, పలువురు న్యాయవాదులు, విద్యావంతులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు