Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పురుషోత్తం

లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్రమంత్రి భైంసా, బాసర పర్యటన

బాసర అమ్మవారిని దర్శించుకొని,గంగా హారతి సేవలో హాజరు
వేద పాఠశాల సందర్శన
భైంసాలో బైక్ ర్యాలి

ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 8 (నిజం న్యూస్)

దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల కి ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు,ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.

అమ్మ వారి దివ్యదర్శనం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అర్చకులు అమ్మవారి శేషవస్త్రమును, తీర్థప్రసాదాలను అందజేసారు.అనంతరం స్థానిక వేద పాఠశాలను సందర్శించి, వేదాలు అభ్యసిస్తున్న విద్యార్థులతో కాసేపు మాట్లాడారు.గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ: అన్ని రంగాలలో వేగవంతమైన అభివృద్ధి

గోదావరి నది వద్ద భక్తులకు పలు రకాల సేవలు అందిస్తున్న గంగపుత్రులను కలుసుకొని పలు విషయాలు చర్చించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు  శాలువా తో సత్కరించి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జ్ఞాపిక ను బహుమతిగా అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో వీరి వెంట నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షులు పడకంటి రమాదేవి,ముధోల్ నియోజకవర్గ నాయకులు పవార్ రామారావు పటేల్,భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు మాజీలు – సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మరియు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు