అన్ని రంగాలలో వేగవంతమైన అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి
రాష్ట్ర ఐ.టి., పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
మంచిర్యాల జిల్లా ప్రతినిది మే 08 (నిజం న్యూస్) బెల్లంపల్లి
తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వం వందల సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా ప్రజల సంక్షేమంతో పాటు అన్ని రంగాలలో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ దేశం దృష్టిని ఆకర్షించి మన రాష్ట్రంలోని పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరించే స్థాయికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఐ.టి., పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
సోమవారం జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర రక్షణ, జైళ్ళు, అగ్నిమాపక శాఖ మంత్రి ఎండి. మహమూద్ అలీ, రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్నత, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్లు నల్లాల భాగ్యలక్ష్మీ, కోవ లక్ష్మి, రాథోడ్ జనార్ధన్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిర్పూర్, ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్రావు, ఆత్రం సక్కు కోనేరు కోనప్ప, రేఖానాయక్, రాథోడ్ బాపురావుతో కలిసి శంఖుస్థాపన చేశారు.
ALSO READ: ఇంటర్మీడియట్ ఫలితాలను నేడు ఉదయం 11 గంటలకు
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఐ.టి. రంగాలలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, యువత అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని తెలిపారు.
కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో 2 వేల కోట్ల రూపాయల వ్యయంతో 4వ ప్లాంట్ నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిందని, తద్వారా దాదాపు 4 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని, యువత కొరకు బెల్లంపల్లి పట్టణంలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో 350 ఎకరాలలో 20 కోట్ల రూపాయలతో 27 కంపెనీలతో ఆహార శుద్ధి కేంద్రం ఏర్పాటు కొరకు భూమి పూజ చేయడం జరిగిందని, ఈ ఆహార శుద్ధి కేంద్రం ద్వారా స్థానికలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.
పోలంపల్లి నుండి శికనం వరకు 2 కోట్ల 40 లక్షల రూపాయలతో, యేసాయిపల్లి నుండి లింగాల వరకు 2 కోట్ల 54 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణాలు, లక్ష్మీపూర్ నుండి బద్దంపల్లి మీదుగా వేమనపల్లి వరకు 16 కోట్ల 57 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 2 వంతెనల నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిందని, పెద్దదుబ్బ నుండి చేతలాపూర్ వరకు 2 కోట్ల 88 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి, 3 కోట్ల 30 లక్షల రూపాయలతో దమ్మిరెడ్డిపేట నుండి నెన్నెల వరకు రోడ్డు నిర్మాణానికి, చాకెపల్లి నుండి కాసిపేట గ్రామం వరకు 3 కోట్ల 29 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం, పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్.సి., ఎస్.టి. భవనం 2 కోట్ల రూపాయలతో, మహిళల కోసం 5 కోట్ల 50 లక్షల రూపాయలతో మండల, గ్రామ సమాఖ్య భవనాలు, బెల్లంపల్లి నుండి వెంకటాపూర్ వెళ్ళే రోడ్డు పునఃరుద్దరణ కొరకు 5 కోట్ల 65 లక్షలతో పనులకు శంఖుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.
ALSO READ: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
బెల్లంపల్లి పట్టణంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు 44 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పంప్ హౌస్ ను ప్రారంభించడం జరిగిందని, రైతుబజార్, మార్కెట్ రోడ్డు, శిశు మందిర్ రోడ్డు విస్తరణ, పాలిటెక్నిక్ కళాశాల నుండి రవీంద్రనగర్ వెళ్ళే సి.సి. రోడ్డు పనుల కొరకు 6 కోట్ల 72. లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంఖుస్థాపన చేయడం జరిగిందని, మొత్తంగా 114 కోట్ల 89 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు.
7 వేల ఇండ్ల పట్టాలలో భాగంగా 3 వేల ఎస్.ఆర్.టి. క్వాటర్లు, 4 వేల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని 30 పట్టాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించడం
జరిగిందని, కౌన్సిలర్లు ఇంటింటికి వచ్చి పట్టాలు అందజేస్తారని తెలిపారు. పుట్టినగడ్డకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సనాతన ఐ.టి. సెల్యూషన్స్ ఐ.టి. సంస్థను బెల్లంపల్లిలో ప్రారంభించి 100 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని, వాల్యూ పిచ్ పేరుతో మరొక సంస్థ ద్వారా 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడం సంతోషంగా ఉందని, బెల్లంపల్లికి మరిన్ని ఐ.టి. సంస్థలు వస్తాయనే నమ్మకం వచ్చిందని తెలిపారు.
10 విడతలుగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని 47 వేల మంది రైతులకు 650 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. వయోవృద్ధులకు, దివ్యాంగులు 27 వేల 500 మందికి ప్రతి నెల పెన్షన్లు అందించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మందికి ఆడబిడ్డల పెళ్ళిళ్లకు 1 లక్షా 116 రూపాయలు ప్రభుత్వం నుండి అందించడంలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా 7 వేల మందికి అందించడం జరిగిందని తెలిపారు.
మృతి చెందిన 50 మంది రైతుల కుటుంబాలకు రైతుభీమా పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందించడం జరిగిందని, దళితబంధు పథకంలో భాగంగా మొదటి దశలో నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు 1100 మందికి రాబోతుందని, ప్రభుత్వం 10 లక్షల రూపాయలు అందించడం ద్వారా దళితులకు ధనికులు కావాలనే ఉద్దేశ్యంతో చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
187 చెరువులు బాగు చేసుకున్నామని, 15 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు 50 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ, టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధులను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి సంస్థను మరింత విస్తరించడం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వంలో 15 వేల మందికి కారుణ్య నియామకాలు కొలువులు అందించడం జరిగిందని, 4 వేల 207 నూతన ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, 540 మంది డిస్మిస్ కార్మికులను ఉద్యోగంలోకి తీసుకున్నామని, పదవీ విరమణ వయస్సు పరిమితిని 61 సం॥లు పెంచడం జరిగిందని, లాభాల బోనస్ ను పెంచడం జరిగిందని తెలిపారు.
రైతుల సంక్షేమం, అభివృద్ధి కొరకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం లబ్దిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణదాసు, పురాణం సతీష్, నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, భోజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల ప్రజాపరిషత్ సభ్యులు, వ్యవసాయ మార్కెట్, సింగిల్ విండో అధ్యక్షులు, సర్పంచ్లు సంబంధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.