Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆ పట్టణానికి పది రోజుల నుండి నీళ్లు బంద్

మహబూబాబాద్ పట్టణానికి పది రోజుల నుండి నీళ్లు బంద్

తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు.

రెండు రోజులకు ఒకసారి నీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదు.

నోరు మెదపని మున్సిపాలిటీ అధికారులు.

పట్టణంలో నోరు ఎండిపోతున్న గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి.

మహబూబాబాద్ బ్యూరో మే 8 నిజం న్యూస్

మహబూబాబాద్ జిల్లా పట్టణంలో సుమారు గత పది రోజుల నుండి మంచినీటి కుళాయిల లో నీరు రావడం లేదు.

మేజర్ గ్రామపంచాయతీ నుండి మొదలుకొని, నేటి మున్సిపాలిటీ వరకు పట్టణ ప్రజలకు రోజు తప్పించి రోజు మంచి నీరు రావడం జరుగుతుంది. ఎన్నికలు ఉన్న ప్రతిసారి సర్పంచ్ గా కానీ మున్సిపల్ చైర్మన్ గా కానీ మంచినీటి సమస్య గురించి కరపత్రాలు తీసిన వారే, హామీలు ఇచ్చిన వారే, కానీ ఇప్పటివరకు పట్టణ మంచినీటి సమస్యను పూర్తిస్థాయిలో తీర్చిన వారు ఎవరూ లేరు. గత గ్రామపంచాయతీల హయాంలో పట్టణ ప్రజలకు మంచినీటి కొరత తీర్చడానికి ప్రభుత్వం లక్షలాది రూపాయలు కేటాయించడం జరిగింది.

అది పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో పనిచేసిన సర్పంచ్ సుధా అర్జున్ రెడ్డి హయాంలో రోజు తప్పించి రోజు ఒకసారి నీరు వచ్చిన ,ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనలేదని, వేసవిలో మున్నేరు వాగులో నీరు లేకున్నా ,కాకతీయ కెనాల్ నుండి నీరు తెప్పించి ప్రజలకు అందించిందని ,ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు .

ప్రస్తుతం మున్సిపాలిటీగా అవతరించి పది సంవత్సరాలు కావస్తున్న, నేటికీ పట్టణ ప్రజల మంచినీటి దాహం తీరలేదు. మున్సిపాలిటీ అవతరించి చుట్టూ ఉన్న గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. 36 వార్డుగా మున్సిపాలిటీ అవతరించింది. ఇన్ని వార్డులతో మున్సిపాలిటీ అవతరించినప్పుడు ప్రజల తాగునీటి సమస్య ఏర్పడుతుంది.

దీనికి తగ్గ పక్క ప్రణాళికలు కూడా అవసరం అవుతాయి. జిల్లా పరిపాలన అధికారులు కూడా ఎండాకాలం రాకముందు నుంచి సంబంధిత అధికారులతో ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పట్టణ ప్రజలకు ఈ వేసవిలో మంచినీటి కొరత లేకుండా చూడాలని ఎన్నిసార్లు సమావేశాలు పెట్టి చెప్పిన “దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ఉందని” పట్టణ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ALSO READ: అమెరికాలోని టెక్సాస్‌ కాల్పుల్లో నేరేడుచర్ల అమ్మాయి…

సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులను సంప్రదిస్తే ,పైపులు లీక్ అవుతున్నాయి, రిపేర్లు చేస్తున్నాము ,అవి పూర్తికాగానే ప్రజలకు మీరు అందిస్తామని, పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారు .జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ ,ఎమ్మెల్సీ ,మినిస్టర్ లు ఉన్న స్పందించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

మిషన్ భగీరథ నిర్మాణ పనులు పూర్తికాగానే రోజు రాష్ట్ర ప్రజలకు మంచినీటి అవసరాలు తీరుస్తామని, ఒకవైపు ప్రభుత్వం డoకా బజాయించి చెపుతుంటే, పట్టణ మున్సిపల్ అధికారులు మాత్రం మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి ,ఆ పనులు కాగానే పట్టణ ప్రజలకు మీరు అందిస్తామని అంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

పట్టణం మొత్తంలో మిషన్ భగీరథ పనులు నడిపిస్తున్నారా అని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టణంలో పాత బజార్ కొత్త బజార్ రెండు బజార్లు ఉన్నాయి. ఒకవైపు మిషన్ భగీరథ పనులు నడుస్తున్న రెండోవైపు ప్రజలకు నీటిని అందించవచ్చు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇటీవల రాష్ట్ర సీఎం ,కేసీఆర్, కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్లు మంజూరు ఇవ్వడం జరిగింది. వార్డుల అభివృద్ధికి కోటి రూపాయల చొప్పున ఇచ్చిన మిగతా డబ్బులను మంచినీటి సమస్యకు ఖర్చుపెడితే పట్టణ ప్రజల దాహార్తి శాశ్వతంగా తీరగలదని ప్రజలు అనుకుంటున్నారు.

పట్టణ ప్రజల మంచినీటి సమస్య తీర్చడానికి జిల్లా పరిపాలన అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి .పట్టణ మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చడానికి నడుం కడుతుందో? లేకపోతే” దున్నపోతు మీద వర్షం కురిసిన చందం “గా ఉంటుందో వేచి చూడాలి.