Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అమెరికాలోని టెక్సాస్‌ కాల్పుల్లో నేరేడుచర్ల అమ్మాయి…

అమెరికాలో మన నెరేడుచెర్ల తెలుగు అమ్మాయి మృతి.

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం అలెన్‌ పట్టణంలో ఓ మాల్‌లో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి దుండగుల తూటాలకు బలైంది.

Also read: నిరాయుధుడిని పట్టుకొని కాల్చి చంపారు….మావోయిస్టు లేఖ విడుదల

ఈమె తండ్రి పేరు నర్సిరెడ్డి. రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. తల్లి పేరు అరుణ. కూతురు మరణవార్త తెలిసి వీరు శోకసంద్రంలో మునిగిపోయారు.

అమెరికాలో స్థిరపడిన అమ్మాయి ఇలా దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.