నిరాయుధుడిని పట్టుకొని కాల్చి చంపారు….మావోయిస్టు లేఖ విడుదల
*పుట్టపాడు ఎన్కౌంటర్ బూటకం..
*నిరాయుధుడిని పట్టుకొని కాల్చి చంపారు.. మావోయిస్టు డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదల
చర్ల మే 8 (నిజం న్యూస్) చతీష్ గడ్ అటవీ ప్రాంతం పుట్టపాడులో ఆదివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ భూటకమని నిరాయుధుడిని పట్టుకొని కాల్చి చంపారని ఇది పోలీసుల పిరికిపంద చర్య అని భద్రాద్రి కొత్తగూడెం సీతా రామరాజు డివిజన్ మావోయిస్టు కార్యదర్శి అజాద్ పేరిట లేక విడుదల చేశారు
దీనికి జిల్లా ఎస్పీ వినీత్ డిఎస్పి సత్యనారాయణ సిఐ అశోక్. బిఆర్ఎస్ పార్టీ లీడర్లు బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు
చతీష్ గడ్ సరిహద్దు పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని ఇందులో చర్ల ఎల్.ఓ.సి కమాండర్ రాజేష్ మరో ధన సభ్యుడు మృతి చెందారని ఒక ఎస్ ఎల్ ఆర్ తుపాకీ దొరికిందని చెబుతున్నారని ఇది బూటకం.
Also read: భూమికి దూరంగా జీవం ఉందా లేదా అని …పాము లాంటి రోబోట్‌ను అభివృద్ధి చేస్తోన్న NASA
ప్రజలు ప్రజా స్వామిక వాదులు ఖడించాలని లేఖలో పేర్కొన్నారు. రాజేష్ పార్టీ పనుల రీత్యా పొట్టపాడు నిరాయుదుడిగా వెళ్ళాడని ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపి ఇది నిజమైన ఎన్కౌంటర్ అని నమ్మించడానికి తమతో పాటు తెచ్చుకున్న ఎస్ఎల్ఆర్ తుపాకీని పెట్టి అదే గ్రామానికి చెందిన నందాల అనే అమాయక ఆదివాసిని. ఒక నిరాయుడిని పట్టుకుని కాల్చి ఎన్కౌంటర్ రంగు పులిమారని పేర్కొన్నారు
రాజేష్ విప్లవ ప్రస్థానం సతీష్ గాడ్ రాష్ట్రం సుకుమార్ జిల్లా కంగల్ గ్రామం ( 26) ఆదివాసి నిరుపేద మడకం కుటుంబంలో పుట్టి 19 వ ఏట విప్లవోద్యమం లో చేరి 2016 నుండి 2022 అక్టోబర్ వరకు చెర్ల ఎల్.ఓ. ఎస్ సభ్యుడుగాను 2022 నుండి చర్ల ఎల్వో ఎస్ కమాండర్ గా బాధ్యతలు చేపట్టాడని మావోయిస్టులులేఖలో పేర్కొన్నారు