మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం, రోడ్డుకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షాలు

మంగళవారం రాత్రి బూర్గంపాడు మండలం లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ వర్షం తాకిడికి సంజీవ రెడ్డి పాలెం-పాల్వంచ రహదారి మధ్య భారీ వృక్షాలు రోడ్డు కు అడ్డంగా నేలకొరిగాయి. వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.సంబంధిత శాఖ అధికారులు ఇప్పకి స్పందించక పోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే చెట్లను తొలగించి వాహనదారులకు అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.