మానవసేవే మాధవసేవ అంటున్న..
గ్రామీణ వైద్యుల సంఘ సమావేశం.
పెగడపల్లి మే 7 (నిజం న్యూస్)
పెగడపల్లి మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల సంఘ సమావేశం ఆదివారం రోజున జరిగినది ఈ కార్యక్రమంలో పి ఎం పి & ఆర్.ఎం.పి అసోసియేషన్ పెగడపల్లి మండల అధ్యక్షులు కుసుమ శంకర్ మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామీణ వైద్యులు వారి పరిధిలో ప్రథమ చికిత్స ప్రజలకు రాత్రి పగలు అనకుండా గ్రామాలలో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ మానవసేవే మాధవసేవ అంటూ మానవత దృక్పథంతో వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యులు ముందుంటారు.
ALSO READ: లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ భారీ విజయం
ఆర్.ఎం.పి & పి.ఎం.పి సుమారుగా 70 సంవత్సరాల నుండి గ్రామాల్లో వైద్య సేవలు చేస్తున్నారు దానిని గుర్తించిన అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గ్రామీణ వైద్యులకు జీవో 429 ప్రకారం గ్రామీణ వైద్యులకు కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ సుమారు 25 వేల మందికి ఇచ్చారు కానీ సర్టిఫికెట్ అందజేయలేదు,
అందజేస్తామని తెలియజేశారు కానీ దురదృష్టవశత్తు ముఖ్యమంత్రి మృతి చెందడం వలన జీవో అమలు కాలేదు, కావున ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జీవో 428 గా మార్చారు,
కానీ గ్రామీణ వైద్యులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు ఇప్పుడైనా తెలంగాణ ప్రభుత్వం దీనిపైన విచారణ చేసి గ్రామీణ వైద్యులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాము,
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాజుల గంగాధర్, కోశాధికారి బర్ల మల్లేశం, జగిత్యాల జిల్లా మాజీ అధ్యక్షులు జుంజురు రమేష్, కార్యవర్గ సభ్యులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.