Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిచిన SRH

జైపూర్‌: అబ్దుల్‌ సమద్‌ చివరి బంతికి సిక్సర్‌ బాదడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించి ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

జోస్ బట్లర్ (95), సంజు శాంసన్ (66) దూకుడు అర్ధసెంచరీలతో, రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

ఆ తర్వాత అభిషేక్ శర్మ (55), రాహుల్ త్రిపాఠి (47)  రాణించగా ,  యుజ్వేంద్ర చాహల్ (4/29) నాలుగు వికెట్లు పడగొట్టి

RR ను గెలిపించినంత పని చేశాడు .

ALSO READ: 9 న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
గ్లెన్ ఫిలిప్స్ (25) పరుగులు చేశాడు.  సందీప్ శర్మ వేసిన నో బాల్‌ను, ఆఖరి బంతికి సిక్సర్‌తో అబ్దుల్ సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్) విజయానికి  అవసరం అయిన  పరుగులను రాబట్టాడు . సన్‌రైజర్స్ తరఫున భువనేశ్వర్ కుమార్ (1/44), మార్కో జాన్సెన్ (1/44) చెరో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు: రాజస్థాన్ రాయల్స్: 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 (జోస్ బట్లర్ 95, సంజు శాంసన్ 66 నాటౌట్; భువనేశ్వర్ కుమార్ 1/44). సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 (అభిషేక్ శర్మ 55; యుజువేంద్ర చాహల్ 4/29).